రత్నమాల పుట్టిన రోజు.. మాస్ కు పండగే

వైవిధ్యమైన కథలతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ను రూపొందిస్తోన్న సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. వీరు త్రివిక్రమ్ స్థాపించిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి విశ్వక్ సేన్ హీరోగా ఓ కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ‘విఎస్ 11’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోనన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోన్న సమాచారం.

ఇక ఈ యాక్షన్ డ్రామా చిత్రంలోవిశ్వక్ సేన్ క్రూరమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి రాజోలు బ్యూటీ అంజలి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ శుక్రవారం తన బర్త్ డే. ఈ సందర్భంగా మూవీ నుంచి తన పోస్టర్ ను విడుదల చేసింది టీమ్. ఈ సినిమాలో అంజలి రత్నమాలగా కనిపించనుంది. కెరీర్ ఆరంభం నుంచి బెస్ట్ స్క్రిప్ట్స్ నుంచుంటూ తనలోని నటిని ఎప్పటికప్పుడూ ప్రూవ్ చేసుకునే పాత్రలతో మెప్పిస్తోన్న అంజలి పాత్ర మాస్ ను మెప్పించేలా ఉంటుందంటున్నారు.

ఇక ఈ మూవీ నుంచి తనకు “సహజ నటి” అన్న బిరుదును కూడా తగిలించింది సితార బ్యానర్. మరి ఇంత పెద్ద మాటకు తను అర్హురాలా కాదా అనేది చెప్పలేం కానీ.. ఈ చిత్రానికి లిటిల్ మేస్ట్రో యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన సంగీతం సినిమాలకు ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

ఇప్పటికే విడుదలైన విశ్వక్ సేన్ గంగానమ్మ జాతర, రాగ్స్ టు రిచ్స్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రంలోని రత్నమాలకు తెలుగు 70ఎమ్ఎమ్ నుంచి బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts