రాముడుగా విజయం వస్తే కొత్త చరిత్రే..

పౌరాణిక చిత్రాలు తీయాలంటే ఇండియాలో తెలుగువారి తర్వాతే ఎవరైనా అనే మాట ఒకప్పుడు బలంగా ఉండేది. ఆ మాటకొస్తే ఇప్పటికీ మనమే టాప్. రామాయణం, భారతం, భాగవతం వంటి పౌరాణికాలను మనవాళ్లు ఎంత గొప్పగా తీశారో అందరికీ తెలుసు. ఈ స్థాయిలో ఇండియన్ సినిమా హిస్టరీలో మరెవరూ తీయలేదు అనేది నిజం. కానీ ఇప్పుడు ప్రభాస్ రాముడుగా నటించిన ఆదిపురుష్ అందుకు కాస్త భిన్నంగా కనిపిస్తోంది.

ఇలాంటి రాముడిని ఇప్పటి మనం చూడలేదు. అందుకే కొంతమంది అంత సులువుగా ఓన్ చేసుకోలేకపోతున్నారు. పైగా సీత పాత్రలో నటించిన కృతి సనన్ అంతకు ముందు చాలా సినిమాల్లో విపరీతమైన ఎక్స్ పోజింగ్ కూడా చేసి ఉండటంతో కొంతమంది అదే పనిగా ఈ ఫోటోస్ తో ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు. బట్ కొన్నిసార్లు కొన్ని సినిమాలకు ఇలాంటివి తప్పవు. మరోవైపు ఇది కూడా కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ తరహా చిత్రం అనేవాళ్లూ ఉన్నారు. ఎవరెన్ని అనుకున్నా.. ఒక విషయంలో విజయం సాధిస్తే ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు. కాదు.. హిస్టరీయే క్రియేట్ చేస్తాడు.


ఇప్పటి వరకూ మనకు వెండితెరపై “మీసాల రాముడు” కనిపించలేదు. కనిపించినా అది సినిమా అంతా లేదు. ఏదైనా కొన్ని సన్నివేశాల్లో చూశాం. బట్ ఇలా ఆజానుబాహుడైన రఘురాముడు అనగానే కనిపించే రూపంతో వస్తోన్న ప్రభాస్ రాముడుగా విజయం సాధిస్తే ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ విషయంలో ఇన్ని ట్రోల్స్, విమర్శలు ఎదుర్కొని కూడా రాముడుగా/ రాఘవుడుగా అలరించిన హీరో అతనే అవుతాడు. అంతే కాక మీసాలు, వస్త్రధారణ విషయంలోనూ విజయం సాధించాడు అని చెప్పొచ్చు. ఇకపై ఎవరైనా రామాయణం తీస్తే ఒళ్లంతా నీలి రంగు పూసుకోనక్కర్లేదు. నారబట్టలే కట్టుకుని అట్ట బాణాలే తీసుకుని యుద్ధాలు చేయక్కర్లేదు అనేందుకు ఓ రూట్ క్లియర్ చేసినవాడూ అవుతాడు.


నిజానికి మనం చూసిన రాముడు ఫైనల్ అనో, లేక నార్త్ చూపించే రాముడే ఫైనల్ అనో చెప్పడానికి ఎవరి దగ్గరా సరైన ఆధారాలు లేవు. కేవలం శిలా విగ్రహాలు, కావ్యాల్లో వచ్చిన వర్ణణనలను బట్టే ఆ రాముడు రూపాన్ని ఊహించుకున్నారు. అంటే ఎవరి ఊహలకు ఎలా ఉంటే ఆయనే రాముడు అని నమ్ముతారు కదా..? అలా ఈ దర్శకుడు రాముడిని ఇలా ప్రభాస్ లో ఊహించుకున్నాడు. అలాగే చూపించబోతున్నాడు. అందుకే ఈ చిత్రం విజయం సాధిస్తే ప్రభాస్ ఖచ్చితంగా ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినవాడు అవుతాడు.

Related Posts