‘హాయ్ నాన్న’ ట్రైలర్.. నాని ఎమోషనల్ డ్రామా..

సినిమా సినిమాకి వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ ముందుకు సాగిపోతుంటాడు నాని. ఇక.. లేటెస్ట్ గా నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా పూర్తిస్థాయి ఎమోషనల్ డ్రామాగా అలరించబోతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని శౌర్యువ్‌ తెరకెక్కించాడు. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘హాయ్ నాన్న’ ట్రైలర్ రిలీజయ్యింది.

ఫాదర్ అండ్ డాటర్ బ్యూటిఫుల్ బాండింగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. తండ్రి ఎంత బాగా చూసుకున్నా.. అమ్మ లేని లోటు ఆ పాపను వెంటాడటం.. వాళ్ల మధ్యలోకి మృణాల్ ఎంటరవ్వడం.. నాని తో లవ్ లో పడటం.. ట్రైలర్ లో హైలైట్స్. ఇక.. నాని భార్య పాత్రలో శ్రుతి హాసన్ కేమియోలో కనిపించడం ఈ ట్రైలర్ కి కొసమెరుపు. ఇతర కీలక పాత్రల్లో జయరాం, ప్రియదర్శి అలరించబోతున్నారు. ఓవరాల్ గా మనసుని హత్తుకునే ఎమోషనల్ డ్రామాలా ‘హాయ్ నాన్న’ ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మోహన్ చెరుకూరి, డా.విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts