మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రాకులాడను – ‘లైన్‌మ్యాన్’ హీరో త్రిగుణ్

తెలుగులో చిన్నా చితకా సినిమాలు చేసినా టాలెంటెడ్ యంగ్‌స్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు త్రిగుణ్. ఇప్పుడు ‘లైన్ మ్యాన్‌’ అనే మూవీతో కన్నడ ఇండస్ట్రీలో ఎంట్ర ఇస్తున్నాడు. వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో ప్రెస్టీజియస్ పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ , తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. మార్చి 22 న గ్రాండ్ గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో త్రిగుణ్ మీడియా సమావేశం లో సినిమా విశేషాలు పంచుకున్నారు.ఈ చిత్ర నిర్మాతలు ఓ మూడు స్క్రిప్ట్‌లు పంపితే అందులో లైన్‌మ్యాన్‌ మూవీ కథ నచ్చిందన్నారు. నటుడిగా నేను 23 సినిమాలు చేసాను.. కానీ నాకు లైన్‌మ్యాన్‌ సినిమా స్పెషల్. నా కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే సినిమా అన్నారు త్రిగుణ్.


రఘుశాస్త్రి గారు మంచి రైటర్‌.. చక్కగా తెరకెక్కించారు. మన పల్లెటూరు ఫ్లేవర్ ఈ సినిమాలో ఉంటుందన్నారు. కమర్షియల్ సినిమాలు చేయాలని, మార్కెట్ పెంచుకోవాలనే ఆలోచనతో నేను వర్క్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోను కూడా. నాతో సినిమా చేసిన నిర్మాతకు దాని వల్ల లాభాలే తప్ప నష్టాలుండకూడదని నమ్ముతాను. అదే ఫాలో అవుతున్నానన్నారు త్రిగుణ్.సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో నటించటానికి వెనుకాడను. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్‌ల్లో నటించాను. అందులో 11 అవర్ ఒకటి. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నూ నటిస్తున్నాను. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది రిలీజ్ అవుతోన్న నా రెండో చిత్రం లైన్ మ్యాన్. మరో చిత్రాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. అన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి అన్నారు హీరో త్రిగుణ్‌

Related Posts