‘ఫ్యామిలీ స్టార్’ సంక్రాంతి నుంచి తప్పుకుందా?

గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా రాబోయే సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదు. తెలుగు నుంచి ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, ఈగల్, ఫ్యామిలీ స్టార్, హనుమాన్’.. తమిళం నుంచి ‘లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్, అయలాన్’ మొత్తంగా తొమ్మిది సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక వీరిలో ఎవరికి వారు తగ్గేదే లే అంటూ సంక్రాంతికి పక్కాగా వస్తామంటూ సంకేతాలిస్తూనే ఉన్నారు. అయితే.. లేటెస్ట్ గా సంక్రాంతి బరి నుంచి విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ తప్పుకుందనే ప్రచారం జరుగుతుంది.

‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సంక్రాంతి సమయాల్లో ఖచ్చితంగా తన ప్రొడక్షన్ నుంచి సినిమా ఉండేటట్టు చూసుకునే దిల్ రాజు.. ‘ఫ్యామిలీ స్టార్’ని సంక్రాంతి బరిలో నిలపడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. అయితే.. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో ఈ మూవీ సంక్రాంతి నుంచి సమ్మర్ కి షిప్టయ్యే సూచనలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే.. ‘ఫ్యామిలీ స్టార్’ పోస్ట్ పోన్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts