‘హనుమాన్’ థర్డ్ సింగిల్.. ఆవకాయ ఆంజనేయ కథ..

పేరుకు చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో విడుదలకు ముస్తాబవుతోన్న చిత్రం ‘హనుమాన్’. ఇప్పటివరకూ హాలీవుడ్ సూపర్ హీరోస్ మూవీస్ చూసుంటారు. కానీ.. ఇప్పుడు వస్తున్నాడు కొత్త సూపర్ హీరో.. మన హనుమాన్ ముందు వాళ్లంతా జీరో అంటూ ‘హనుమాన్’ ప్రమోషన్స్ లో జోరు పెంచుతోంది టీమ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలవ్వగా.. ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు. ‘ఆవకాయ ఆంజనేయ కథమొదలెట్టినాడు సూడరయ్యా.. శక్తినంత కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య..’ అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది.

అనుదీప్ దేవ్ సంగీతంలో సింహాచలం మన్నెల రాసిన ఈ గీతాన్ని సాహితీ గాలిదేవర ఆలపించింది. ‘జాంబిరెడ్డి’ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రమిది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘హనుమాన్’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts