‘రాజా సాబ్‘ ఫస్ట్ లుక్.. లుంగీ కట్టుకుని అదరగొడుతోన్న డార్లింగ్

‘సలార్‘ మూవీలో డైనోసార్ లా యాక్షన్ లో రెచ్చిపోయిన ప్రభాస్.. ఇప్పుడు మారుతి మూవీ కోసం డార్లింగ్ గా మారాడు. ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు.. హిలేరియస్ కామెడీతోనూ ఎంటర్ టైన్ చేయనున్నాడట. రొమాంటిక్ హారర్ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

గతంలో రొమాంటిక్ రోల్స్ లో అలరించినా.. ప్రభాస్ కి హారర్ జానర్ కొత్త. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీకి ‘రాజా సాబ్‘ అనే టైటిల్ ఖరారు చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

‘రాజా సాబ్‘ ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో వింటేజ్ లుక్ లో, లుంగీ కట్టుకుని అదరగొడుతున్నాడు డార్లింగ్. తమన్ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ మూవీకి మరెంతో మంది టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ ఏడాది ద్వితియార్థంలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది.

Related Posts