మన ‘హనుమాన్’ ముందు అందరూ జీరో

వచ్చాడు కొత్త సూపర్ హీరో.. మన హనుమాన్ ముందు అందరూ జీరో’ అంటూ ‘హనుమాన్’ నుంచి కొత్త పాట వచ్చేసింది. హాలీవుడ్ సూపర్ హీరోస్ అందరితోనూ కంపేర్ చేస్తూ.. మన హనుమాన్ ముందు వారంతా జీరో అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. యానిమేషన్ తో సరికొత్తగా డిజైన్ చేసిన ఈ లిరికల్ సాంగ్ లో మధ్యలో హీరో తన సూపర్ పవర్స్ తో అలరించే సన్నివేశాల తాలూకు విజువల్స్ బాగున్నాయి. అనుదీప్ దేవ్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ పాటను సాయి వేద వాగ్దేవి, ప్రకృతి రెడ్డి, మయూఖ్ ఆలపించారు.

‘జాంబిరెడ్డి’ తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న చిత్రమిది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు.. కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్ లోనూ ‘హనుమాన్’ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts