బాలయ్య షోలో బాలీవుడ్ హీరో

పాన్ ఇండియా మూవీస్ ప్రమోషన్స్ కోసం మన స్టార్ హీరోస్ అప్పుడప్పుడూ ముంబైలో చక్కర్లు కొడుతుంటారు. బాలీవుడ్ టాప్ షోస్ అయిన ‘కాఫీ విత్ కరణ్, కపిల్ శర్మ’ షోస్ లో కనిపించడానికి ఉత్సాహాన్ని చూపిస్తుంటారు.

అయితే.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం మన నటసింహం నిర్వహిస్తున్న ‘అన్ స్టాపబుల్’షోలో పాల్గొనాలని పోటీపడుతున్నారు.

ఇటీవలే ‘అన్ స్టాపబుల్’ లిమిటెడ్ ఎడిషన్ మొదలయ్యింది. మరోసారి తన మెస్మరైజింగ్ హోస్టింగ్ తో ఈ షోలో నటసింహం బాలకృష్ణ చెలరేగిపోతున్నాడు.

లేటెస్ట్ గా ‘అన్ స్టాపబుల్’షో లో ‘యానిమల్’ టీమ్ సందడి చేసింది. హీరోహీరోయిన్లు రణ్ బీర్ కపూర్, రష్మిక లతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ షోలో పాల్గొన్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ ఆహా వేదికగా ప్రసారం కానుంది. డిసెంబర్ 1న ‘యానిమల్’ రిలీజ్ కు రెడీ అవుతుంది.

Related Posts