హైదరాబాద్ లో ‘దేవర’ కొత్త షెడ్యూల్

స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అయినా.. మేకర్స్ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. కానీ.. ఎన్టీఆర్ ‘దేవర’ విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు షూటింగ్ అప్డేట్స్ ను అందిస్తూనే ఉంది టీమ్. దీపావళికి బ్రీఫ్ ఫెస్టివల్ బ్రేక్ తీసుకున్న టీమ్ మళ్లీ షూటింగ్ మోడ్ లోకి వచ్చేసింది. లేటెస్ట్ గా మరొక ఎపిక్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందని సోషల్ మీడియా వేదికగా తెలిపింది ‘దేవర’ టీమ్.

ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ‘దేవర’ షూటింగ్ కొనసాగుతుందట. రెండు వారాల పాటు ఈ షెడ్యూల్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చిత్రంలో ఉన్న ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారట. ఈ షెడ్యూల్ తో దాదాపు టాకీ పార్ట్ పూర్తవుతుందట. ఆ తర్వాత పాటల చిత్రీకరణ మొదలవుతుంది. ‘దేవర’ ఫస్ట్ పార్ట్ 2024, ఏప్రిల్ 5న విడుదలకానుంది.

Related Posts