ఎస్తర్‌ నోరానా ‘మాయ’ గ్రాండ్‌ ప్రీరిలీజ్ ఈవెంట్

మిస్టీరియస్ థ్రిల్లర్‌ మూవీస్‌కి మినిమమ్ గ్యారెంటీ ఆదరణ ఉంటుంది. స్క్రీన్‌ ప్లేతో మాయ చేస్తే చాలు సినిమా హిట్ గ్యారెంటీ.. అలాంటి సినిమానే మాయ. ఎస్తర్‌నోరానా, కిరణ్ ఆవల, సురేష్ కొండేటి మెయిన్ లీడ్ చేస్తున్న ఈ మూవీని రమేష్‌ నాని డైరెక్షన్‌లో విన్‌క్లౌడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ గొరిజవోలు నిర్మించారు. సత్యంరాజేష్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ అమర్‌దీప్ ముఖ్యఅతిధులుగా ఈ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ రిలీజ్‌ చేసారు. ట్రైలర్‌ ఆద్యంతం మిస్టరీ థ్రిల్లర్‌ లవర్స్‌ని ఆకట్టుకునేలా ఉంది. సినిమా విజయం పై నమ్మకాన్ని పెంచింది.


తన లైఫ్ జర్నీ కి సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది హీరోయిన్ ఎస్తర్‌. చిన్న బడ్జెట్‌, పెద్ద బడ్జెట్‌ సినిమాలుంటాయి కానీ చిన్న పెద్ద అనే తేడా ఉండదన్నారు. ఏదో ఒక ఆశయంతో ముందుకు సాగాల్సిందే.. ఈ సినిమా మొదలుపెట్టి సినిమా రిలీజ్‌ వరకు సహకరించిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్‌ అన్నారు ఎస్తర్. అలాగే నిర్మాత రాజేష్ గారు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారన్నారు. ఈ సినిమా క్రైమ్‌ స్టోరీ అయినా ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు.


ఈ సినిమాకు తనవంతు సాయం ఎప్పుడూ ఉంటుందన్నారు అమర్‌దీప్. ఎస్తర్‌ తన ఫ్రెండ్ అనీ, తన కోసమే ఇక్కడకు వచ్చాననీ.. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలనీ కోరుకున్నారు అమర్‌దీప్‌.కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండదు.. మాయ సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్నారు సత్యం రాజేష్. ఎస్తర్‌ నోరానా కమిట్‌మెంట్ ఉన్న యాక్టర్.. ఓ సినిమా షూటింగ్ లో లంచ్‌ టైమ్‌లో కూడా డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం చూసానన్నారు సత్యం రాజేష్‌. అలాగే మెయిన్‌ లీడ్ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా చేస్తున్నారెందుకని అడిగితే.. ఏదైనా క్యారెక్టరే కదా.. ఇండస్ట్రీలోకొచ్చా.. ఇక్కడే ఉండాలి కదా అన్నారు. అలాంటి గొప్ప నటి ఎస్తర్‌ అని ప్రశంసించారు సత్యం రాజేష్.మా సినిమాని డిస్ట్రిబ్యూటర్ బాపినీడు గారు బాగా ప్రోత్సాహించారన్నారు ప్రొడ్యూసర్‌ రాజేష్‌. కథ, స్క్రీన్‌ ప్లే అద్భుతంగా వచ్చింది.. బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా సినిమా తీయండని చెప్పానన్నారు. రమేష్ అద్భుతంగా తీసారన్నారు. ముఖ్య అతిధులుగా వచ్చిన సత్యం రాజేష్, అమర్‌దీప్‌కు థ్యాంక్స్ చెప్పారు నిర్మాత రాజేష్‌.


ఈ సినిమా ఇంత అద్భుతమైన ఔట్‌పుట్ రావడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ రాజేష్‌ గారు.. క్వాలిటీ ఔట్‌పుట్ కోసం ఖర్చుకు వెనకాడకుండా ప్రోత్సాహించారన్నారు డైరెక్టర్‌ రమేష్‌ నాని. ఎస్తర్‌ అద్బుతమైన నటే కాదు మంచి మనిషి అన్నారు. సత్యం రాజేష్‌ తో పరిచయం లేకపోయినా అడగ్గానే ఈవెంట్ కు వచ్చారనందుకు థ్యాంక్స్ అన్నారు.

Related Posts