మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టిన డివివి

టాలీవుడ్ లోని ఒన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటి డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్. ముఫ్ఫై ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న డి.వి.వి. సంస్థ ఎంతోమంది అగ్ర తారలతో సినిమాలు చేసింది. అయితే.. 2022లో వచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ ఈ సంస్థను అగ్ర పథాన నిలిపింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు క్రేజీ స్టార్స్ తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రపంచవ్యాప్తంగా అత్యద్భుత వసూళ్లను సాధించింది. ఇక.. అంతర్జాతీయంగానూ ఈ సినిమా సాధించిన అవార్డుల గురించి తెలిసిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తోన్న డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ ఇకపై సినిమాల స్పీడు పెంచబోతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ’, నాని తో ‘సరిపోదా శనివారం’ సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఈ చిత్రాలతో పాటు.. లేటెస్ట్ గా మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టిందట. వాటిలో ఒకటి తమిళ ఇలయదళపతి విజయ్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో ‘వారసుడు’ చేసిన విజయ్.. ఇప్పుడు మరో తెలుగు నిర్మాణ సంస్థ డి.వి.వి. లో సినిమా చేయడానికి అంగీకారాన్ని తెలిపాడట. అయితే విజయ్-డి.వి.వి. సంస్థలో రూపొందే సినిమాకి దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. అలాగే.. ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్ తో నాని హీరోగా ఓ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీని సైతం డి.వి.వి లైన్లో పెడుతుందట.

Related Posts