మిషన్ రాణిగంజ్ ట్రైలర్ ఎలా ఉంది

ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస విజయాలతో ఆకట్టుకున్నాడు అక్షయ్ కుమార్. మధ్యలో ఎక్కడో బాలీవుడ్ లాగానే గాడి తప్పాడు. కంటెంట్ లేని సినిమాలతో కమర్షియల్ గా బాగా లాస్ అవుతున్నాడు. రీసెంట్ గా వచ్చిన ఓ మై గాడ్2లో మంచి కంటెంట్ ఉంది.కానీ పాత ఫ్లాపుల ఎఫెక్ట్ వల్ల ఆ సినిమా అనుకున్నంత పెద్ద విజయం సాధించలేదు.

ఇక ఇప్పుడు ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తున్నాడు. ఆ సినిమా పేరు మిషన్ రాణిగంజ్. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ. జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సరిహద్దులో ఉన్న రాణిగంజ్ లోని బొగ్గు గనుల్లో 1989లో అక్కడ పనిచేస్తున్న కొందరు చిక్కుకు పోతారు. ఇప్పట్లా అప్పుడు యంత్ర పరికరాలు లేవు. ఈ కారణంగా తవ్వుకుంటూ వెళుతున్న వారికి నీటి ప్రవాహం అడ్డొస్తుంది. ఆ ప్రవాహంలో వాళ్లంతా చిక్కుకుని ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఉంటారు. వారిని కాపాడేందుకు అప్పుడ అక్కడ పనిచేసే మైనింగ్ ఇంజినీర్ అయిన జశ్వంత్ సింగ్ అత్యంత సాహసోపేతంగా అనేక ప్రయత్నాలు చేసి వారిలో 65మంది ప్రాణాలు కాపాడతాడు. ఇదీ అప్పుడు జరిగిన వాస్తవం.


ఆ వాస్తవ సంఘటనల ఆధారంగానే ఇప్పుడు మిషన్ రాణిగంజ్ అనే సినిమా రూపొందింది. జశ్వంత్ సింగ్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కు భిన్నంగా ఎమోషనల్ కంటెంట్ తో రూపొందినట్టుగా ఈ మూవీ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ పాత్రలో అక్షయ్ సిన్సియర్ గా కనిపిస్తున్నాడు. ఏదైనా తెలియని ఇన్నోసెన్స్ తో కూడిన హీరోయిజం అక్షయ్ కుమార్ కు బాగా సూట్ అవుతుంది.

ఆ పాత్రల్లో అద్భుతమైన విజయాలు సాధించాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే హిట్ మెటీరియల్ లా కనిపిస్తోంది. ప్రతి ఫ్రేమ్ రియలిస్టిక్ గా ఉంది. ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు ఓ నిజాయితీ పరుడైన ఇంజినీర్ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి విజయం సాధించడం అనేది సినిమాటిక్ గానూ కమర్షియల్ పాయింట్ గా వర్కవుట్ అవుతుంది. అందుకే ఈ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. టీనూ సురేష్ దేశాయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కాబోతోంది. మరి ఈ మూవీతో అక్షయ్ కుమార్ కూడా ఏమైనా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Related Posts