గుంటూరు కారం సినిమాటోగ్రాఫర్ ను మార్చారా

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న థర్డ్ మూవీ గుంటూరు కారం. ఏ ముహూర్తంలో మొదలైందో కానీ ఈ మూవీ షూటింగ్ ఎప్పుడూ సజావుగా సాగడం లేదు. అసలు కథే మారిపోయింది. రెండో కథతో స్టార్ట్ అయిన తర్వాత మహేష్‌ బాబు ఎప్పుడూ కరెక్ట్ గా షూటింగ్స్ లో జాయిన్ కాలేదు అంటారు.

ముఖ్యంగా మెయిన్ షెడ్యూల్స్ పెట్టుకున్న సమ్మర్ లో ఆయన సెట్స్ కే రాలేదు. మధ్యలో పూజాహెగ్డే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. శ్రీ లీలను మెయిన్ లీడ్ కు మార్చినా.. మళ్లీ సెకండ్ హీరోయిన్ కోసం వేట సాగుతూనే ఉంది. ఈ కారణంగానే సంక్రాంతికి వస్తుందనుకున్న సినిమా వస్తుందా రాదా అనే డౌట్‌స్ ను క్రియేట్ చేసుకుంది. మొత్తంగా గత నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.

అయితే సినిమా మొదలైన దగ్గర్నుంచీ చాలా విషయంలో మహేష్ బాబు అసంతృప్తిగానే ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్‌ బాబు ఫ్యామిలీతో కలిసి మళ్లీ వెకేషన్ కోసం లండన్ కు వెళ్లాడు.

ఈ లోగా గుంటూరు కారంకు సంబంధించి ఓ పెద్ద మార్పు జరిగింది. ఇప్పటి వరకూ ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా ఉన్నాడు. మరి ఏమైందో కానీ తాజాగా ఈ ప్లేస్ లోకి రవి కే చంద్రన్ వచ్చాడు. ఇతన్ని తెలుగుకు పరిచయం చేసింది మహేష్‌ బాబే. భరత్ అనేనేను చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన రవి కే చంద్రన్ తర్వాత భీమ్లా నాయక్ కు సినిమాటోగ్రఫీ అందించాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ ఓజికి పనిచేస్తున్నాడు.


పిఎస్ వినోద్ తో త్రివిక్రమ్ కు బాగా సెట్ అవుతుంది. అతను పంజాతో తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. త్రివిక్రమ్ తో అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాలకు పనిచేశాడు. ఈ రెండు సినిమాల్లోనూ అతని వర్క్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే థర్డ్ మూవీకీ ఆయన్నే కంటిన్యూ చేస్తున్నాడు త్రివిక్రమ్. మరి ఏమైందో కానీ ఇప్పుడు ఆయన్ని తొలగించి మహేష్‌ కు నచ్చిన సినిమాటోగ్రాఫర్ నే తీసుకున్నారు.

Related Posts