నారా రోహిత్ రీ ఎంట్రీ

ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్నాడు నారా రోహిత్. తెలుగు తెరపైకి బాణంలా దూసుకువచ్చి సోలోగానే సత్తా చాటాడు. రోహిత్ సినిమా అంటే ఏదో కొత్త పాయింట్ గ్యారెంటీ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యేలా చేయగలిగాడు.

ప్రస్తుతం అతన్లానే డిఫరెంట్ మూవీస్ చేస్తోన్న శ్రీ విష్ణుతో కలిసి చేసిన అప్పట్లో ఒకడుండేవాడు ఓ రేంజ్ మూవీ. ఈ మూవీ తర్వాత వరుసగా ఐదు సినిమాలు పోయాయి. అయినా మరో నాలుగు సినిమాలు అనౌన్స్ అయి ఉన్నాయి. పండగలా వచ్చాడు, అనగనగా దక్షిణాదిలో, శబ్ధం, మద్రాసీ అంటూ ఆ సినిమాల పోస్టర్స్ కూడా విడుదలయ్యి ఉండేవి. మరి ఏమైందో సడెన్ గా ఇండస్ట్రీ నుంచే తప్పుకున్నాడు.

అటు పొలిటికల్ గానూ యాక్టివ్ కాలేదు కానీ.. అప్పుడడప్పుడూ కొన్ని కమెంట్స్ మాత్రం చేస్తూ వస్తున్నాడు. మధ్యలో రకరకాల గెటప్స్ లోనూ కనిపించాడు. దీంతో ఇక అతను టాలీవుడ్ కు గుడ్ బై చెప్పినట్టే అనుకున్నారు. బట్ లేదు. రోహిత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అతి కూడా తన ప్రతినిధి మూవీకి సీక్వెల్ తో.
అప్పట్లో ప్రతినిధి అనే సినిమాతో మంచి విజయం సాధించాడు.

థాట్ ప్రోవోకింగ్ సినిమాగా ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. కాకపోతే సినిమా అంతా మీడియాపై సెటైర్స్ వేస్తూ.. మీడియా వైఫల్యాలను ఎండగడుతూ.. ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ లో కనిపిస్తుంది. అయినా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు రెండో పార్ట్ తోనే రోహిత్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.అప్పట్లో ఈ చిత్రాన్ని ప్రశాంత్ మండవ డైరెక్ట్ చేశాడు. ఆనంద్ రవి రచయిత. తర్వాత ఆనంద్ .. నా నీడ పోయింది సర్ అంటూ నెపోలియన్ అనే సినిమాతో దర్శకుడుగా మారాడు. రీసెంట్ గా కొరమీను అనే సినిమా చేశాడు.


కానీ ఈ సారి ప్రతినిధి టీమ్ తో కాకుండా పూర్తిగా కొత్త టీమ్ తో ప్రతినిధి2 చేయబోతున్నాడట నారా రోహిత్. ఇప్పుడున్న చాలామంది యంగ్ స్టర్స్ తో కంపేర్ చేస్తే రోహిత్ బెటర్ యాక్టర్. అందగాడు. మంచి వాయిస్ కూడా ఉంది. మరి ఇకనైనా సరైన కథలు ఎంచుకుంటే ఇంకా అతనికి ఛాన్స్ ఉందనే చెప్పాలి.

Related Posts