ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చాడా

కేజీఎఫ్‌ కు ముందు ఒకే ఒక్క సినిమా చేసి ఉన్నాడు ప్రశాంత్ నీల్. అయితే కేజీఎఫ్‌ కోసం ఏకంగా నాలుగేళ్లు కష్టపడ్డాడు. దాని ఫలితమే అతనికి ఓవర్ నైట్ ప్యాన్ ఇండియన్ డైరెక్టర్ ఇమేజ్ వచ్చింది. కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో సెకండ్ చాప్టర్ కు మరింత హైప్ వచ్చింది. ఆ హైప్ ను కూడా అందుకుని కలెక్షన్స్ లోనూ రికార్డ్స్ సృష్టించింది.

దాంతో పాటే దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ కూడా డబుల్ అయింది. అతనితో సినిమా చేయాలని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్నీ పోటీ పడుతూ అడ్వాన్స్ లు ఇచ్చాయి. అలా ఇచ్చిన వాటిలో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఉంది. వీళ్లు పర్టిక్యులర్ గా ఎన్టీఆర్ తో కాంబినేషన్ సెట్ చేస్తూనే అడ్వాన్స్ ఇచ్చింది. ఇటు చూస్తే ప్రశాంత్ .. ఎన్టీఆర్ ను కాదని ప్రభాస్ తో సినిమా స్టార్ట్ చేశాడు.

అఫ్ కోర్స్ అప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నాడు. ఇక ప్రభాస్ తో రూపొందించిన సలార్ ఓ కొలిక్కి వచ్చింది. సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ కు సిద్ధం కావాలి. ఇదే టైమ్ లో మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది. సలార్ 2 కంటే ముందు కేజీఎఫ్ 3 కూడా ఉంటుందట. అంటే సలార్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 స్టార్ట్ చేస్తాడంటున్నారు. ఆ తర్వాత సలార్ 2. అంటే ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చినట్టే కదా అంటున్నారు.


నిజానికి సలార్ తర్వాత ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలి ప్రశాంత్ నీల్. వీరి కాంబోలో వచ్చే సినిమాకు కథ విషయంలో కూడా ఇద్దరికీ ఓ అండర్ స్టాండింగ్ ఉందంటున్నారు. అయినా ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ తో సినిమా విషయంలో అంత ఆసక్తి చూపించడం లేదు అనే టాక్ వినిపిస్తోంది. సలార్ తో తన రేంజ్ మరింత పెరుగుతుందని.. అప్పుడు కేజీఎఫ్‌ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఉన్న క్రేజ్ కు ఊహించిన దానికంటే డబుల్ క్రేజ్ వస్తుందనే భావంతో ఉన్నాడట.

అయినా ఎన్టీఆర్ తో కమిట్మెంట్ ఉంది కాబట్టి.. తీరిగ్గా మూడు నాలుగేళ్ల తర్వాత చూద్దాం అనేలా ఉన్నాడంటున్నారు. ప్రశాంత్ గురించి తెలిసే.. ఎన్టీఆర్ కూడా వార్ 2 మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు అనే పాయింట్ తీస్తున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా ప్రశాంత్ నీల్ టేకింగ్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో పడితే ఎలా ఉంటుందో చూడాలని ఇతర హీరోల అభిమానులు కూడా అనుకున్నారు. కానీ ప్రశాంత్ తీరు చూస్తుంటే.. ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. సింపుల్ గా చెబితే ప్రశాంత్ నీల్.. సైలెంట్ గా ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చాడనే అంటున్నారు. మరి దీనికి ఎవరైనా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాలి.

Related Posts