కీర్తి సురేష్ నే ఫిక్స్ చేశారా

సౌత్ లో ఎలాంటి పాత్ర అయినా చేయగల నటి అంటే వెంటనే గుర్తొచ్చే పేరు కీర్తి సురేష్. గ్లామర్ రోల్స్ నుంచి డీ గ్లామర్ రోల్స్ వరకూ అలవోకగా నటించేస్తుంది. అందుకే చాలా తక్కువ టైమ్ లోనే తనకు బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది.మరోవైపు హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు ఓటిటి బేస్డ్ కంటెంట్ తోనే బెస్ట్ అనిపించుకుంటోందీ బ్యూటీ.

వరుస ఆఫర్స్ తో సౌత్ మొత్తం చుట్టేస్తోన్న ఈ మహానటి కోసం ఇప్పుడు మరో తెలుగు సినిమా ఎదురుచూస్తోంది. యస్.. సినిమానే తనకోసం ఎదురుచూస్తోంది అంటున్నారు.ఇది అందరూ ఊహిస్తున్న ప్రాజెక్టే. నాగ చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు అని గతంలోనే వార్తలు వచ్చాయి. అవి నిజమే అంటూ తనకోసమే టీమ్ ఎదురుచూస్తోందట.


ఇప్పటికే కీర్తికి కథ చెప్పారంటున్నారు. జాలరుల జీవితాల నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రాబోతోన్న ఈ చిత్రంలో ఓ ఇంటెన్స్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట.లవ్ స్టోరీతో పాటు హీరోయిన్ పాత్రకు బలమైన నటన అవసరం అనుకుంటున్నారు. అందుకే కీర్తి సురేష్ అయితే రెండు కోణాల్లోనూ అదరగొడుతుంది.

దీనికి తోడు చైతూ తో ఫస్ట్ టైమ్ జోడీ కడుతుంది కాబట్టి కాంబినేషన్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. చందు మొండేటి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయబోతున్నాడు. అతని పై నమ్మకంతోనే గీతా ఆర్ట్స్2 బ్యానర్ కూడా భారీ బడ్జెట్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి కీర్తి సురేష్ ఎంట్రీ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందంటున్నారు.

Related Posts