పవన్ కళ్యాణ్ ను వదిలేసిన దర్శకుడు

పవర్ స్టార్ తో సినిమా అంటే మాటలు కాదు.. రోజులు అని అందరికీ అర్థం అవుతోంది. యస్.. ఆయనతో సినిమా కమిట్ అయితే అది పూర్తి కావడం ఎవరి చేతుల్లో ఉటుంది అంటే ఎవరూ చెప్పలేని రోజులివి. ఏ సినిమా ఎప్పుడు కమిట్ అవుతాడో.. ఏ సినిమా ఎందుకు పూర్తి చేస్తాడో తెలియని పరిస్థితి ఉంది.

ముందు ఒప్పుకున్నవాటిని కాదని వెనక ఓకే చేసిన సినిమాలు రిలీజ్ చేస్తుంటే ఏ నిర్మాతకైనా, దర్శకుడికైనా ఓ తెలియని ఆవేదన ఉంటుంది. ముఖ్యంగా నిర్మాతల పరిస్థితి దారుణంగా మారుతుంది. ప్రస్తుతం ఆ సిట్యుయేషన్ లోనే రెండు సినిమాలున్నాయి. ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్.రెండోది హరిహర వీరమల్లు. ఈ రెండూ రెండేళ్ల క్రితం ఒప్పుకున్న సినిమాలు.

వీటిని కాదని భీమ్లా నాయక్, బ్రో సినిమాలు పూర్తి చేసి రిలీజ్ కూడా చేశారు. అయినా ఈ దర్శకులు ఓపికగానే ఎదురుచూస్తున్నారు. చివరికి హరీష్ శంకర్ ను కరుణించాడు పవన్ కళ్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక షెడ్యూల్ పూర్తయింది. మరో షెడ్యూల్ కు ప్లాన్ చేసుకోమని రీసెంట్ గా చెప్పాడు అంటున్నారు. కానీ పవన్ సెట్స్ పైకి వచ్చేంత వరకూ ఎవరికీ నమ్మకం లేదు. ఇక రెండో దర్శకుడు క్రిష్.


ఇన్నాళ్లూ ఎదురుచూసిన క్రిష్ ఇక పూర్తిగా ఆశలు వదులుకున్నాడు. అందుకే మరో ప్రాజెక్ట్ ను సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే స్టోరీ రెడీ అయింది. హీరో కోసం చూస్తున్నాడట. కొంచెం ఇమేజ్ ఉన్న హీరో అయితేనే తన కథలో సెట్ అవుతాడని భావించిఆ మేరకు ఖాళీగా ఉన్న హీరోలందరికీ స్టోరీ చెప్పే ప్రయత్నాల్లో ఉన్నాడు.అయితే కొందరు ప్రొడ్యూసర్స్ కొత్త హీరోలతో అప్రోచ్ అవుతున్నారట. బట్ ఆ కథకు కాస్త ఇమేజ్ కూడా అవసరం అనేది క్రిష్ ఆలోచన అంటున్నారు. కానీ అతనిప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. అందుకే కొత్తవాడైతే బిజినెస్ కు చాలా సమస్య ఉంటుంది. అందుకే కాస్త పేరున్న ఉన్న హీరో అయితే బావుంటుందనే కోణంలో ఆలోచిస్తున్నాడట. అంటే పవన్ కళ్యాణ్ ఇక తన సినిమా చేయడు అని అతను ఫిక్స్ అయ్యాడా లేక ఎన్నికల తర్వత ఉంటుందనే హామీ అందుకున్నాడా తెలియదు కానీ.. మొత్తంగా క్రిష్ కాస్త ఆలస్యమైనా హరిహరను వదిలేసి మంచి పనే చేస్తున్నాడు.

Related Posts