సాయిధరమ్ తేజ్ ను మరీ ఇబ్బంది పెడుతున్నారా ..

యాక్సిడెంట్ నుంచి కోలుకుని విరూపాక్ష మూవీలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సాయితేజ్. ఈ మూవీపై మొదటి ఎవరికీ అంతగా నమ్మకం లేదు. కానీ తను ప్రమాదానికి గురి కావడానికి ముందే కమిట్ అయిన సినిమా. కొంత షూటింగ్ కూడా చేశారు. అందుకే సాయితేజ్ యాక్సిడెంట్ ను కోలుకున్న వెంటనే ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో పాటల విషయంలో సాయితేజ్ చాలా ఇబ్బంది పడ్డాడు.

మంచి డ్యాన్సర్ అయిన అతను బ్రో మూవీలోని రెండు పాటల్లో వేసిన స్టెప్పులు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అదే విషయం ప్రమోషన్స్ అడిగారు. అప్పుడు తనింకా పూర్తిగా కోలుకోలేదు అనే మాట చెప్పాడు సాయి. అంతే కాదు.. తను కొన్నాళ్లుగా ప్రమోషన్స్ లోనూ వేదికలపైనా మాట్లాడుతున్నప్పుడు వాయిస్ కూడా క్లియర్ గా లేదు. బాగా తడబడుతున్నాడు. మాటలు వెదుక్కుంటున్నట్టు కనిపిస్తున్నాడు.

స్పష్టంగా పదాలు పలకలేకపోతున్నాడు. ఇవన్నీ చూస్తే నిజంగానే అతను పూర్తిగా కోలుకోలేదు అని ఎవరికైనా అర్థం అవుతుంది.అయితే బ్రో సినిమా పూర్తయిన వెంటనే ఓ లాంగ్ లీవ్ తీసుకుని ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెడతానని చెప్పాడు. బట్ అతని ఇబ్బందిని ఎవరూ పట్టించుకుంటున్నట్టుగా లేదు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన తర్వాత కూడా ప్రమోషనల్ టూర్స్ పేరుతో అతన్ని ఆంధ్రప్రదేశ్ లో అదే పనిగా తిప్పుతున్నారు. ప్రమోషన్స్ కు పవన్ కళ్యాణ్ రాడు. సాయితేజ్ వస్తున్నా.. అడుగడుగునా అతని అనారోగ్యం కనిపిస్తోంది. అయినా ఈ తీరుగా ఇబ్బంది పెట్టడం ఏం బావుందని చాలామంది అనుకుంటున్నారు.

అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడని వేదికలపై చూస్తేనే అర్థం అవుతుంది. అక్కడ ఆ ఇబ్బంది కనిపించకూడదని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. అంత ప్రయత్నం చేసినా కనిపిస్తోందంటే.. మిగతా టైమ్ లో ఇంకెంత సఫర్ అవుతుంటాడు. అవేవీ పట్టించుకోకుండా అతన్నిలా టూర్స్ పేరిటి తిప్పడం ఏంటో మరి.

Related Posts