దేవరకొండ బుల్లోడి డీసెంట్ లైనప్

ఏ ఫీల్డ్ లో అయినా విజయం కిక్ ఇస్తుంది. సినిమా ఫీల్డ్ లో కిక్ తో పాటు కొత్త కొత్త ఆఫర్స్ ను కూడా ఇస్తుంది. పైగా ఆ ఆఫర్స్ అంతకు ముందున్న వాటికంటే బెటర్ గా ఉంటాయి. బేబీ సినిమాతో కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఏదో నటించాడు అని కాకుండా ఈ సారి మంచి నటన కూడా చూపించాడు. తన పాత్రలో పూర్తిగా జీవించాడు.

అతని పాత్ర చాలామంది యూత్ కు కనెక్ట్ అయింది. అతన్లో తమనుతాము చూసుకుంటున్నవాళ్లూ ఉన్నారు. అందుకే ఈ సినిమా అంత పెద్ద హిట్ గా నిలిచింది. విడుదలై మూడు వారాలవుతున్నా.. కలెక్షన్స్ పరంగా ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. మరి ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఆనంద్ నెక్ట్స్ మూవీస్ లైనప్ మారుతుంది కదా.. మారింది.


ప్రస్తుతం గమ్ గమ్ గణేశా అనే సినిమా చేస్తున్నాడు ఆనంద్. ఈ మూవీ షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత తమిళ్ లో ప్రతిష్టాత్మకమైన బ్యానర్ గా చెప్పుకునే స్టూడియో గ్రీన్ బ్యానర్ లో జ్ఞానవేల్ రాజా నిర్మించే సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంతో ఓ కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. అటుపై మైత్రీ మూవీస్ లో అడుగుపెడుతున్నాడు ఆనంద్.

ఇంతకు ముందు ఆనంద్ తోనే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేసిన వినోద్ అనంతోజు ఈ చిత్రానికి దర్శకుడు. మిడిల్ క్లాస్ మెలోడీస్ అప్పట్లో ఓటిటిలోనే విడుదలైనా హిట్ టాక్ తెచ్చుకుంది. ఓ రకంగా ఆనంద్ కు ఇదే ఫస్ట్ హిట్. ఈ సారి థియేటర్స్ లో సత్తా చాటేందుకు ఈ కాంబినేషన్ రెడీ అవుతుంది. ఇక జ్ఞానవేల్ రాజాతో పాటు మైత్రీ మూవీస్ సినిమా కూడా ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటాయట. మరి ఈ మూడింటిలో ఏ రెండు హిట్ అయినా ఆనంద్ రేంజ్ కూడా మారుతుంది.

Related Posts