దేవర.. బ్రూటల్ యాక్షన్ సీన్ అయిపోయిందట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడుకు దేవర మూవీ టీమ్ కూడా షాక్ అవుతున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లోమొదలైన దేవర షూటింగ్ విషయంలో ఎన్టీఆర్ చాలా స్పీడ్ గా ఉన్నాడు. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీ షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. రీసెంట్ గానే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మరో షెడ్యూల్ ఈ మధ్యే స్టార్ట్ అయింది.

హైదరాబాద్ లోనే వేసిన సెట్స్ లో ఓరెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. వీటిలో అప్పుడే ఒక ఫైట్ సీక్వెన్స్ పూర్తయిందట. ఈ ఫైట్ ను పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు. ఇక ఈ సీన్ గురించి చెబుతూ సినిమాటోగ్రాఫర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


ఫుల్ మూన్ లైట్ లో సముద్రంలో జరిగే ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ అట ఇది. ఈ ఫైట్ బ్రూటల్ గా, రక్తపాతంలో ఉంటుందట. ఇదొక అగ్రెసివ్ యాక్షన్ సీన్ అంటూ రత్నవేలు చేసిన ట్వీట్ కు ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ ట్వీట్ తో పాటు లొకేషన్ ఫోటోస్ ను కూడా షేర్ చేశాడు రత్నవేలు. అవి కూడా వైరల్ అవుతున్నాయిప్పుడు. అఫ్‌ కోర్స్ అందులో ఎన్టీఆర్ లేడనుకోండి.


ఇక దీని తర్వాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఫేమ్ సాల్మన్ కొరియోగ్రఫీలో మరో యాక్షన్ సీన్ వెంటనే చిత్రీకరించబోతున్నారు. ఈ రెండు ఫైట్స్ లో ఎన్టీఆర్ ఇంతకు ముందెప్పుడూ లేనంత అగ్రెసివ్ గా కనిపిస్తాడట. సినిమాలోనూ ఈ ఫైట్‌స్ చాలా హైలెట్ అవుతాయంటున్నారు. మొత్తంగా రిలీజ్ డేట్ చాలా దూరం ఉన్నా.. షూటింగ్ మాత్రం చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివతో ఇంతకు ముందు చేసిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అయింది.

బట్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో కొత్త ఇమేజ్ తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. దానికి తగ్గట్టుగా ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రూపొందుతోంది.


ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా సౌత్ ఆడియన్స్ కు పరిచయం కాబోతోంది. సైఫ్‌ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మళయాల నటుడు టామ్ చాకో కూడా నెగెటివ్ రోల్ చేస్తున్నాడట. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ దేవర సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొత్తంగా 2024 ఏప్రిల్ 5న విడుదల కాబోతోన్న ఈ మూవీకి సంబంధించి వస్తోన్న ప్రతి వార్తా అంచనాలను పెంచుతూనే ఉంది.

Related Posts