అప్పుడే డిసెంబర్ వార్ మొదలయ్యింది?

సినిమాల ప్రొడక్షన్ బాగా పెరిగింది. దీంతో.. విడుదల తేదీల విషయంలో బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పడం లేదు. ఎప్పుడూ లేనివిధంగా ఈ ఏడాది రాబోయే ఐదారు నెలల్లో పెద్ద సినిమాల సందడి భారీగా ఉంది. బడా మూవీస్ అన్నీ వరుసగా బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. దీంతో.. మీడియం రేంజ్ అన్నీ డిసెంబర్ వైపు చూస్తున్నాయి.

ఈ లిస్టులో మొదటగా డిసెంబర్ లో రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది ‘రాబిన్ హుడ్’. ‘భీష్మ’ వంటి బడా హిట్ తర్వాత నితిన్-వెంకీ కుడుమల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల నాయికగా నటిస్తుందనే ప్రచారం ఉన్నా.. ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘రాబిన్ హుడ్’ ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. డిసెంబర్ 20న ‘రాబిన్ హుడ్’ రిలీజ్ కు రెడీ అవుతుంది.

డిసెంబర్ లో క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదలకు ముస్తాబవుతోన్న మరో చిత్రం ‘తండేల్’. గీతా ఆర్ట్స్ లో నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ఇది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘తండేల్’ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో చైతన్యకి జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. పలు సూపర్ హిట్ కాంబోస్ లో రెడీ అవుతోన్న ‘తండేల్’ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనుందట టీమ్.

Related Posts