‘ఎక్స్ట్రా- ఆర్డినరీ మేన్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్..

నితిన్ నటించిన 32వ చిత్రం ఎక్స్ట్రా. ఆర్డినరీ మేన్ అనేది క్యాప్షన్. దర్శక రచయిత వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు డా. రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించboaతున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఆదిత్య మూవీస్, ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ భాగస్వామ్యంతో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ నెల 27వ తేదీన ఎక్స్ట్రా- ఆర్డినరీ మేన్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేసే ప్లేస్ ని కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్స్ పిసి ఎక్స్ లో 27న సాయంత్రం 4 గంటలకి ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. ఇప్పటికే ‘డేంజర్ పిల్లా’ అనే సాంగ్ రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా, డిసెంబర్ 8వ ఎక్స్ట్రా- ఆర్డినరీ మేన్ విడుదల కాబోతుంది.

Related Posts