హరీష్‌ శంకర్ బిజెపిలో చేరుతున్నాడా.. ?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరుగా ఉన్నాడు హరీష్‌ శంకర్. మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ తో స్టార్ హీరోలను కొత్తగా ప్రెజెంట్ చేయడంలో హరీష్‌ స్టైల్ గురించి అందరికీ తెలుసు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు హరీష్‌.

తన హీరోల్లాగే కాస్త రెబల్ గా ఉంటాడు హరీష్‌. ఏదైనా కుండబద్ధలు కొట్టినట్టుగా మాట్లాడతాడు. అలాంటి తను రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడా..? బిజెపిలో జాయిన్ అవుతున్నాడా..? అంటూ కొత్త సందేహాలకు తెరలేపాడు. సినిమాలు వాళ్లు రాజకీయ నాయకులతో, రాజకీయ నాయకులు సినిమావాళ్లతో సాన్నిహిత్యంగా ఉండటం అన్ని భాషల్లోనూ ఉంది.

వీరి గ్లామర్ పాలిటిక్స్ లో వాడుకుంటారు. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు పొలిటీషియన్స్ ను సినిమా వాళ్లు వాడుకుంటారు. ఇదంతా మామూలుగా జరిగే వ్యవహారమే. అయితే ఇవన్నీ సాధారణంగా స్థానికంగా కనిపిస్తాయి. బట్ ఎప్పుడూ స్థానిక పొలిటీషియన్స్ తో పెద్దగా కనిపించని దర్శకుడు హరీష్‌ శంకర్ ఏకంగా కేంద్ర మంత్రినే కలవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది.


తాజాగా హరీష్‌ శంకర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశాడు. ఆయనతో కాసేపు క్వాలిటీ టైమ్ కు స్పెండ్ చేసినట్టుగా ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంతో హరీష్‌ శంకర్ కూడా బిజెపిలోకి వెళుతున్నాడా అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్‌ కు సంబంధించిన ఏదో మెసేజ్ ను చేరవేయడానికే హరీష్‌ అక్కడికి వెళ్లాడు అంటున్నారు.

ఇంకా చెబితే హరీష్ శంకర్ బిజెపిలో చేరాలనుకుంటే ముందు రాష్ట్ర నాయకులను కలవాలి కదా..? అనేవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా టాలీవుడ్ నుంచి ఏకంగా సెంట్రల్ మినిస్టర్ ను కలిసే సత్తా హరీష్‌ శంకర్ కు ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ఎందుకంటే మామూలుగా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వెళ్లి అపాయింట్ మెంట్ అడిగితేనే రోజుల తరబడి వెయిట్ చేయిస్తారు బిజెపి కేంద్ర మంత్రులు. అలాంటిది హరీష్‌ డైరెక్ట్ గా కలవడం వెనక ఇంకేదో కారణం ఉందని మాత్రం అనిపించక తప్పదు.

Related Posts