ప్రభాస్ తో క్రేజీ బ్యూటీ

డార్లింగ్ స్టార్ ప్రభాస్ కంటిన్యూస్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. సలార్ విడుదల విషయంలో ఆలస్యం అయినా ఆడియన్స్ ను ఏ మాత్రం డిజప్పాయింట్ చేయదు అనే గ్యారెంటీ ఇస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ కాంబినేషన్ లో సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే కొన్ని రీ షూట్స్, సిజి వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ లో పర్ఫెక్షన్ కోసం వాయిదా వేయడం వల్ల ఈ యేడాది విడుదల కావడం కష్టం అనే అంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం విదేశాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి రాగానే ముందుగా మారుతి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా షెడ్యూల్ లో పాల్గొంటాడట. అఫ్ కోర్స్ కొంత విశ్రాంతి తర్వాతే కెమెరా ముందుకు వస్తాడు. మారుతి తర్వాత నాగ్ అశ్విన్ రూపొందిస్తోన్న కల్కి 2898ఏడిని ఏకధాటిగా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు.


ఇక ఆ తర్వాతేంటీ అన ప్రశ్నకు కూడా ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి ప్రభాస్ వద్ద. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రం రూపొందబోతోంది. ఈ మూవీ వచ్చే యేడాది మార్చి / ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుందంటున్నారు. అలాగే 2024లోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. సీతారామంతో ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేసిన హను రాఘవపూడి డైరెక్షన్ లో కూడా ఓ సినిమాకు ఓకే చెప్పి ఉన్నాడు ప్రభాస్.


హను చెప్పిన కథ యుద్ధ నేపథ్యంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. ఈ మూవీలో ప్రభాస్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ మోస్ట్ బిజీయొస్ట్ హీరోయిన్ శ్రీ లీలను తీసుకోబోతున్నారనేది టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ప్రభాస్ ఇమేజ్ కు, రేంజ్ కు శ్రీ లీల కాస్త తక్కువగానే కనిపిస్తుంది. కాకపోతే రాబోయే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయితే తన రేంజ్ కూడా మారుతుంది.

అదే టైమ్ లోవయసు పరంగానూ ప్రేక్షకులు తేడాలు చూసే అవకాశం లేకపోలేదు. బట్ కథలో కరెక్ట్ గా సెట్ అయితే ఆ విమర్శ కూడా వినిపించదు. మొత్తంగా ఇప్పటికైతే ఖచ్చితంగా వినిపిస్తోన్న కాంబినేషన్ ప్రభాస్, శ్రీ లీల, హను రాఘవపూడి. మరి ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Related Posts