కమెడియన్ విశ్వేశ్వరరావు కన్నుమూత

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రెండు రోజుల వ్యవధిలోనే ప్రముఖ రచయిత శ్రీరామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ ‘దాసి’ సుదర్శన్ కన్నుమూశారు. ఈ విషాదాల్ని మర్చిపోక ముందే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కమెడియన్ గరిమెళ్ల విశ్వేశ్వరరావు కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

‘పొట్టిప్లీడరు’ సినిమాలో తొలిసారి నటించిన ఆయన.. బాల నటుడిగా దాదాపు 150 చిత్రాల్లో కనిపించారు. కొన్నేళ్లపాటు సినిమాల నుంచి విరామం తీసుకుని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో మేనేజర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. ‘బిగ్‌బాస్‌, మెకానిక్‌ అల్లుడు, పెళ్లి సందడి, చెప్పవే చిరుగాలి’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించి హాస్యనటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశ్వేశ్వరరావు. ఆయన మరణంతో తెలుగు, తమిళ పరిశ్రమల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Related Posts