ఆగస్టు 15న ‘పుష్ప 2’ వర్సెస్ ‘సింగమ్ ఎగైన్’

పాన్ ఇండియా ట్రెండ్ రాకముందు రీజనల్ ఫిల్మ్స్ మధ్య బాలీవుడ్ చిత్రాల మధ్య క్లాషెస్ పెద్దగా ఉండేవి కావు. ఎవరి రిలీజ్ డేట్స్ వాళ్లవే. కానీ.. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న చిత్రాలను పక్కా ప్లానింగ్ తో విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు కూడా రీజనల్ లాంగ్వేజెస్ నుంచి వచ్చే క్రేజీ మూవీస్ పై ఓ కన్నేసి ఉంచుతున్నాయి. అయినా.. కొన్ని సందర్భాల్లో క్లాషెస్ తప్పడం లేదు.

అలాంటి ఓ బడా క్లాష్ రాబోయే ఆగస్టు 15న ఉండబోతుంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ లో దుమ్మురేపడానికి వస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’. అదే డేట్ కి బాలీవుడ్ క్రేజీ మూవీ ‘సింగమ్ ఎగైన్’ కూడా రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. అయితే.. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి వెళతారా? లేక బాక్సాఫీస్ క్లాష్ కి సిద్ధమవుతారా? అన్నదే ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

బాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ రోహిత్ శెట్టి. తన సినిమాల్లో యాక్షన్ ను ఏ రేంజులో చూపిస్తాడో.. కామెడీని కూడా అంతే స్థాయిలో అదరగొడుతుంటాడు. రోహిత్ శెట్టి బాలీవుడ్ లో ఓ కాప్ యూనివర్శ్ నే సృష్టించాడు. ‘సింగమ్, సింగర్ రిటర్న్స్, సింబ, సూర్యవంశి’ వంటి చిత్రాలు ఈ యూనివర్శ్ లో పోలీస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి మంచి విజయాలు సాధించాయి. ఈకోవలోనే ఇప్పుడు తన ‘సింగమ్’ సిరీస్ లో ‘సింగమ్ ఎగైన్’ మూవీని తీసుకొస్తున్నాడు.

సూర్య నటించిన ‘సింగమ్’ రీమేక్ గా అజయ్ దేవగణ్ ‘సింగమ్’ తెరకెక్కింది. అయితే.. ‘సింగమ్ రిటర్న్స్’ మాత్రం తన సొంత కథతోనే రూపొందించాడు రోహిత్ శెట్టి. ఇప్పుడు కూడా ఓన్ స్టోరీతో ‘సింగమ్ ఎగైన్’ మూవీని తీసుకొస్తున్నాడు. ఈ మూవీలో బాజీరావ్ సింగమ్ గా టైటిల్ రోల్ లో అజయ్ దేవగణ్ కనిపించబోతున్నాడు. మరో రెండు పవర్ ఫుల్ పోలీస్ పాత్రల్లో దీపిక పదుకొనె, టైగర్ ష్రాఫ్ కనిపించబోతున్నారు. ఇంకా.. తన కాప్ యూనివర్శ్ లోని ఇతర హీరోలు అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ కూడా ఈ మూవీలో భాగమవుతున్నారు. మొత్తంగా.. ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ‘సింగమ్ ఎగైన్’ రాబోతుంది. ఈనేపథ్యంలో.. ఆగస్టు 15న ‘పుష్ప 2, సింగమ్ ఎగైన్’ మధ్య పోటీ మామూలుగా ఉండదు అని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

Related Posts