కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. ఢీ షో తో పాపులర్ అయినా రాకేష్ మాస్టర్ ఆ తర్వాత కొన్ని సినిమాలకు నృత్యం సమకూర్చారు. ఢీ తో మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్నా .. ఆ ప్రతిభ వెండితెరపై చూపలేకపోయారు. మరోవైపు తన టైంలో తమిళ్ డాన్స్ మాస్టర్ల హవా ఎక్కువగా ఉండటం కూడా అందుకు ఓ కారణంగా చెప్పొచ్చు.


తిరుపతి లో జన్మించిన రాకేష్ మాస్టర్ డాన్సర్ కావాలన్న కోరికతో చెన్నై వెళ్లారు. అక్కడ ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పని చేసాడు. ఆ సమయంలోనే ధీ ఢీ షో తో వెలుగులోకి వచ్చాడు. ఈ షో జడ్జ్ గా కూడా వ్యవహరించాడు.


కొరియోగ్రాఫర్ గా లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్ళు మొదలైన సినిమాలలోని పాటలకు డాన్స్ అందించారు.


ప్రస్తుతం పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా వెలుగుతోన్న ప్రభాస్ తో పాటు వేణు తొట్టెంపూడి, హీరోయిన్లు మణిచందన, దివంగత నటి ప్రత్యూష ఆయన వద్దే డాన్స్ నేర్చుకున్నారు.
ఇప్పుడు టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫేర్స్ గా వెలుగుతోన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఆయన శిష్యులే. అయితే అవకాశాలు లేక మద్యానికి బానిస అయ్యాడు. కొన్నాళ్ళు డాన్స్ స్కూల్ నడిపినా ఈ వ్యవహారం కారణంగానే ఆగింది.


అటుపై యూట్యూబ్ లో నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరికీ తెలిసాడు. ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు తన శిష్యుల పైనా విపరీత మాటలతో కాంట్రోవర్సియల్ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం యూట్యూబ్ లోనే అడపా దడపా కనిపిస్తోన్న రాకేష్ మాస్టర్ వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ నుండి హైదరాబాద్ వచ్చాడు.

అప్పటి నుండి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు. నేడు(ఆదివారం) ఉదయం ఇంట్లో రక్తవిరోచనాలు చేసుకున్న రాకెష్ ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఏఎంసీ లో ప్రాణాలు కాపాడడం కోసం శత విధాల ప్రయత్నం చేసిన గాంధీ వైద్యులు సాయంత్రం ఐదు గంటలకు రాకేష్ మాస్టర్ మృతి చెందినట్టు ధృవీకరించారు.

Related Posts