చిచ్చా ఒచ్చిండు.. సౌ మార్ కొట్టండి

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా భగవంత్ కేసరి. కాజల్ హీరోయిన్ గా శ్రీ లీల కీలక పాత్రల్లో నటించారు. ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదల కాబోతోందీ సినిమా.

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాలయ్యకు బాక్స్ లు బద్ధలయ్యే మ్యూజిక్ ఇచ్చిన థమన్ మరోసారి ఈ చిత్రానికి సంగీతం ఇచ్చాడు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఆల్రెడీ వస్తుందని ముందే చెప్పారు. చెప్పినట్టుగానే ప్రోమో వచ్చింది.

ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఇక ఈ ప్రోమో చూస్తే ఈ సారి వినాయక చవితి మొత్తానికి ఈ పాటే మోత మోగబోతోందని అర్థం అవుతోంది. గణేష్‌ ఉత్సవాల్లో సందడి చేస్తుంటుంది శ్రీ లీల.. అక్కడికి వచ్చిన బాలయ్య ఆమెను పిలిచి.. ‘ బిడ్డా.. ఆన్తలేదు.. సప్పుడు జర గట్టిగ జెయ్యమని చెప్పూ.. ” అంటాడు. దానికి తను.. అరే తీసి పక్కనబెట్టండ్రా మీ తీన్మార్.. మా చిచ్చా ఒచ్చిండు.. ఎట్లుండాలే.. కొట్టర కొట్టూ సౌ మారూ.. ” అంటుంది.

అంతే.. ఇంకా పాట స్టార్ట్ కాకుండా ప్రోమో అయిపోయింది. బట్ ఈ ప్రమో చూస్తుంటే సినిమాలో చాలా గ్రాండీయర్ గా ఉంటుందీ పాట అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉంది సెటప్. మరి పాటతో మొదటి మోత ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Related Posts