సైంధవ్ నుంచి సర్ ప్రైజింగ్ అప్డేట్

విక్టరీ వెంకటేష్‌ కెరీర్ లో ఓ రేర్ మైల్ స్టోన్ కు చేరుకున్నాడు. సైంధవ్ తో 75వ సినిమా చేస్తున్నాడు. శైలేష్‌ కొలను డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. కొన్నాళ్లుగా తన శైలికి భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు వెంకీ. దృశ్యం నుంచి అతని కెరీర్ మరో టర్న్ తీసుకుంది. ఈ మూవీ రెండు భాగాలతో విజయం అందుకున్నాడు. నారప్పతో ఓటిటిలోనే మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఎఫ్‌3 తో మరో బ్లాక్ బస్టర్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. ఇక ఈ 75వ సినిమా కోసం యాక్షన్ కంటెంట్ ను ఎంచుకున్నాడు.

ఈ చిత్రాన్ని హిట్ సినిమాల ఫేమ్ శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. సైంధవ్ అనే టైటిల్ నుంచి వస్తోన్న ప్రతి అప్డేట్ తో ఆకట్టుకుంటోన్న ఈ మూవీ టీమ్ లేటెస్ట్ గా ఇచ్చిన అప్డేట్ మాత్రం అస్సలు ఎక్స్ పెక్ట్ చేయనిది.


అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న సైంధవ్ లో తమిళ్ స్టార్ హీరో ఆర్య కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మానస్ అనే పాత్రలో కనిపించబోతోన్న అతన్ని పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు.

ఇప్పటికే ఈ మూవీ కాస్టింగ్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. అలాంటిది ఆర్య ఎంట్రీ ఆశ్చర్య పరిచినా.. సినిమాకు మరింత ప్లస్ అవుతుంది. ఆర్య తమిళ్ హీరోనే అయినా తెలుగు వారికి కూడా బాగా కనెక్ట్ అయి ఉన్నాడు. గతంలో అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించాడు. తర్వాత డబ్బింగ్ మూవీస్ తో తెలుగు వారిని మెప్పిస్తున్నాడు. అలాంటి ఆర్య అలియస్ మానస్ గా సైంధవ్ కు సపోర్ట్ గా రాబోతున్నాడు. ఈ పోస్టర్ లో లాంగ్ హెయిన్ తో యాంగర్ గా చూస్తూ చేతిలో పెద్ద గన్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ చాలా బావుందనే చెప్పాలి.


ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నాడు. ఇదే అతని ఫస్ట్ తెలుగు మూవీ. ఫీమేల్ రోల్స్ లో శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కనిపించబోతున్నారు. బే�