చరణ్‌ – ఉపాసన వారసుడి ఉయ్యాల ప్రత్యేకత

రామ్ చరణ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంటి కోడలు అయిన తర్వాత ఉపాసన లైఫ్ స్టైల్ మారిందా అంటే లేదు అనే చెప్పాలి. తన ఇష్టాఇష్టాలను చరణ్ గౌరవించాడు. అందుకే వీరు ఎప్పుడూ అన్యోన్యంగా కనిపిస్తారు. అపోలో హాస్పిటల్ చైర్మన్ మనవరాలైనా.. తనదైన సింపుల్ లైఫ్ తో ఆకట్టకుంటుంది ఉపాసన. ఇక తన పర్సనల్ గానూ ఎన్నో చారిటీస్ చేస్తూ వస్తున్నారు.

హాస్పిటల్ ద్వారానూ ఎంతోమందికి సాయం చేశారు. కొన్నాళ్ల క్రితం గర్భవతి అయిన ఉపాసన మరికొన్ని గంటల్లోనే ప్రసవించబోతోంది. ప్రసవం తర్వాత తమ బిడ్డకు ఉయ్యాల చేయించాలి కదా..? మామూలుగా ఆ బాధ్యత తాతలు తీసుకుంటారు. కానీ ఉపాసన ప్రసవానికి ముందే తన కొడుకు కోసం ఓ ప్రత్యేమైక ఉయ్యాల తయారు చేయించుకుంది. మరి ఉయ్యాలలో అంత ప్రత్యేకతలు ఏమున్నాయి అనుకుటున్నారు కదూ..? ఉన్నాయి. ఎందుకంటే అది ఉజ్వల ఫౌండేషన్ లో తయారైన ఉయ్యాల. ఇండస్ట్రీ ఫ్యామిలీస్ నుంచి ఇప్పటి వరకూ ఆలోచించని విధంగా ప్రజ్వల ఫౌండేషన్ లో తమ కొడుకు కోసం ఉయ్యాల తయారు చేయించింది ఉపాసన.

చాలామందికి ఉజ్వల గురించి తెలియకపోవచ్చు. కానీ హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ ట్రాఫికింగ్ ద్వారా జీవితాలు నష్టపోయి ఈ ఫౌండేషన్ ద్వారా కాపాడబడిన మహిళల కోసం ఓ ఉపాధి కేంద్రాన్ని నెలకొల్పారు. ఆ కేంద్రంలో తయారైందే ఈ ఉయ్యాల. అంటే సెక్స్ ట్రాఫికింగ్ ద్వారా బాధించబడిన మహిళలు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు స్వయం ఉపాధి పొందేందుకు ఈ ఫౌండేషన్ లో నెలకొల్పిన ఉపాధి కేంద్రం నుంచే ఈ ఉయ్యాల తయారు చేయించింది ఉపాసన.

నిజంగా ఇలా చేయాలంటే ఓ మంచి మనసు ఉండాలి. కోటీశ్వరుల ఇంటి బిడ్డ తను. కోరుకుంటే బంగారు ఉయ్యాలే చేయింగల స్థితమంతురాలు. కానీ తన పిల్లలకు సంబంధించి ” వీళ్లు తయారు చేసిన ఈ ఉయ్యాలలో ఒక ఆశ, ఒక బలం, పరివర్తన ఉన్నాయి. అలాంటివన్నీ నా బిడ్డకు చిన్నప్పటి నుంచే అందివ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను” అనేది ఉపాసన అభిప్రాయంగా చెబుతారు. నిజంగా ఉపాసన నిర్ణయం అభినందనీయం. ఆమె బాటలో మరికొందరు వెళితే ఇలాంటి ఎందరో అభాగ్యులకు కొండంత ధైర్యం అవుతుంది.

Related Posts