‘గేమ్ ఛేంజర్’ లుక్ లో సందడి చేసిన చరణ్

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న సందర్భంగా.. ఢిల్లీకి చేరుకున్నారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు. ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిరంజీవి సతీసమేతంగా నిన్ననే ఢిల్లీ వెళ్లారు. తాజాగా.. చరణ్, ఉపాసన ఢిల్లీ వెళ్లడం.. అక్కడ కెమెరా కంటికి చిక్కడం జరిగింది.

ఢిల్లీలో సందడి చేస్తున్న గ్లోబల్ స్టార్.. ‘గేమ్ ఛేంజర్’ లుక్ లో అదరగొట్టాడు. సింపుల్ జీన్స్ షర్ట్, క్యాజువల్ బ్లాక్ ప్యాంట్, కళ్లకు నల్లటి కళ్ల అద్దాలు ధరించి ఉన్నాడు చరణ్. క్లీన్ షేవ్ లో కనిపించిన చరణ్ హెయిర్ స్టైల్ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. ఒకవిధంగా ఇదే ‘గేమ్ ఛేంజర్’ లుక్ అనే ప్రచారం జరుగుతోంది. ‘గేమ్ ఛేంజర్’ లో చరణ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రలో పొలిటీషియన్ గా.. కొడుకు పాత్రలో ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ గా కనువిందు చేయబోతున్నాడు. ‘గేమ్ ఛేంజర్’లో యంగ్ చరణ్ లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.

Related Posts