‘మంగళవారం’ మూవీపై చరణ్ ప్రశంసలు..పాయల్ కృతజ్ఞతలు

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కించిన విలేజ్ యాక్షన్ డ్రామా మంగళవారం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటుంది. రిలీజైన మొదటి రోజు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత అదే టాక్ పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేస్తూ, చిత్రబృందాని సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

దీనికి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపింది. మంచి సినిమాకి ఎప్పుడు ప్రశంసలు తప్పకుండా దక్కుతాయని మరోసారి చరణ్ పోస్ట్ తో అర్థమైంది. అజయ్ భూపతికి ఇది మూడవ సినిమా. ఎంతో ఛాలెంజింగ్ గా భావించి మళ్ళీ పాయన్ తో మగళవారం తీసి హిట్ సాధించాడు. సినిమా చిన్నదా పెద్దదా కాదు కథ బావుంటే అందరూ ఆదరిస్తారని ‘మంగళవారం’ అలాగే, ఈ వారం రిలీజైన ‘కోట బొమ్మాళి పీఎస్’ నిరూపించాయి.

Related Posts