బోయపాటి – రామ్ మూవీ టైటిల్ ఖరారు

మాసివ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. దాదాపు అంతా ఊహిస్తున్నట్టుగా ”స్కంధ” అనే టైటిల్ నే ఫిక్స్ చేశారు.

స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇతను శివపార్వతుల ముద్దు బిడ్డ. దేవతలకు సేనాధిపతిగానూ చెబుతారు. అలాగే స్కందుడికి ఇంకా అనేక పేర్లు కూడా ఉన్నాయి. అలాంటి పేరుతో తన హీరోను చూపించబోతున్నాడు అంటే బోయపాటి ఈ సారి మరింత పవర్ ఫుల్ కంటెంట్ తోనే వస్తున్నాడు అనుకోవచ్చు.

మామూలుగా రామ్ కు బోయపాటి హీరోల రేంజ్ స్టేచర్ లేదు. అతని పర్సనాలిటీ, ఇమేజ్ కూడా అందుకు భిన్నమైనవే. అయినా ఒక్కసారి బోయపాటి ఫిక్స్ అయితే అతని కథల్లోని హీరోల్లా తను ఎంచుకున్నవాళ్లు మారాల్సిందే. అందుకే రామ్ కూడా పర్సనాలిటీ పెంచుకున్నాడు. బాగా లావయ్యాడు. గెడ్డం కూడా పెంచి ఈ పాత్రకు అన్ని విధాలా రెడీ అయ్యాడు. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ చూస్తే పూర్తిగా బోయపాటి హీరోలానే కనిపించాడు.


ఇక సెప్టెంబర్ 15న విడుదల కాబోతోన్న ఈ మూవీలో రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఒకటీ రెండు పాటలు మినహా షూటింగ్ ఎప్పుడో పూర్తయిందంటున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. అదే టైమ్ కు బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి కూడా ఉండటంతో బోయపాటి తనే తప్పుకుని ప్రీ పోన్ చేసుకుని సెప్టెంబర్ లో వస్తున్నాడు.

అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన బోయపాటి టైటిల్స్ ను బట్టి చూస్తే ఇది మాస్ గా లేదు. స్కంధ అంటే మనవాళ్లకు పూర్తిగా అర్థం అవుతుందో లేదో కానీ.. ఈ మూవీ తర్వాత అర్థం చేయించేలా ఉన్నాడు బోయపాటి. మరి ఈ చిత్రంతో రామ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Related Posts