మరో క్రేజీ ఆఫర్ అందుకున్న బాబీ డియోల్?

బాలీవుడ్ సీనియర్ హీరోలు ఒక్కొక్కరిగా సౌత్ కి క్యూ కడుతున్నారు. ఇక్కడి అగ్ర కథానాయకుల కోసం వారంతా విలన్లుగా మారుతున్నారు. ఈ లిస్టులో బాబీ డియోల్ ఒకడు. ఒకప్పుడు బాలీవుడ్ లో ‘గుప్త్, సోల్జర్‘ వంటి బడా హిట్స్ అందుకున్న బాబీ డియోల్ ఆ తర్వాత విజయాలకు దూరమయ్యాడు. ‘హౌస్ ఫుల్ 4‘తో మళ్లీ బీటౌన్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. సౌత్ లో మాత్రం ఫుల్ బిజీ అయిపోతున్నాడు. ఇప్పటికే తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘లో ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు. లేటెస్ట్ గా నటసింహం బాలకృష్ణ 109వ సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నాడట.

బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న బాలకృష్ణ 109 ఇటీవలే చిత్రీకరణ మొదలుపెట్టుకుంది. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా త్రిష, మీనాక్షి చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక.. ఈ మూవీలో మెయిన్ విలన్ గా బాబీ డియోల్ ని ఎంపిక చేసుకున్నారట. అలాగే.. మరో కీలక పాత్రకోసం విలక్షణ దర్శకుడు, నటుడు గౌతమ్ మీనన్ ఎంపికయ్యాడని తెలుస్తోంది. మరోవైపు.. బాబీ డియోల్ విలన్ గా నటించిన రణ్ బీర్ కపూర్ ‘యానిమల్‘ డిసెంబర్ 1న విడుదలకు ముస్తాబవుతోంది. సూర్య పీరియాడిక్ యాక్షన్ ‘కంగువా‘లో కూడా బాబీ డియోల్ నటిస్తున్నాడు. మొత్తంమీద.. సౌత్ లో బాబీ డియోల్ సినిమాల స్పీడు మామూలుగా లేదు.

Related Posts