టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ పంచాయితీ..

టాలీవుడ్ లో ఇప్పుడో బ్లాక్ బస్టర్ పంచాయితీ నడుస్తుంది. తొలి సినిమాకు అవకాశం ఇచ్చాడని ఆ దర్శకుడు.. తొలిసారిగా భారీ హిట్ ఇచ్చాడు కదా అని ఈ హీరో ఇద్దరూ తగ్గడం లేదు.

ఎవరికి వాడు ముందే రాసుకున్న అగ్రిమెంట్స్ ను అడ్డుపెట్టుకుని ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.. కళ్యాణ్‌ రామ్, దర్శకుడు వశిష్ట. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. ఇటు దర్శకుడుగా వశిష్టకు ఫస్ట్ మూవీ. అయినా ఇద్దరూ కలిసి బడ్జెట్ కూడా భారీగానే పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారు. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందనిఅప్పుడే అనుకున్నారు. ఆ మేరకు దర్శకుడు కథ కూడా సిద్ధం చేశాడు. కానీ దర్శకుడికి అనుకోని అవకాశం వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవికి జగదేకవీరుడు తరహా సినిమా కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. మరి మెగాస్టార్ నే ఒప్పించిన దర్శకుడు మినీ స్టార్ అయిన కళ్యాణ్‌ రామ్ తో సినిమా చేస్తాడా..? అందుకే ఈ మూవీని వదులుకుంటున్నాడు. ఇక్కడే కళ్యాణ్ రామ్ ఓ తిరకాసు పెడుతున్నాడు.


బింబిసార2కి మరో దర్శకుడు అనిల్ ను తీసుకుంటున్నాడు. ఇతను ఇంతకు ముందు రొమాంటిక్ అనే సినిమా చేసి ఉన్నాడు.

అయితే వశిష్ట నెక్ట్స్ మూవీ వేరే వారికి చేస్తే ఆ రెమ్యూనరేషన్ లో సగం కళ్యాణ్ రామ్ కు సగం ఇవ్వాలని అగ్రిమెంట్ ముందే రాసుకున్నారట. ఆ రెమ్యూనరేషన్ ను వేరే దర్శకుడికి ఇచ్చి సినిమా చేసుకుంటాడు కళ్యాణ్‌ రామ్.

అదే టైమ్ లో తను ఇచ్చిన కథతో కళ్యాణ్‌ రామ్ చేస్తే తనకూ కొంత అమౌంట్ ఇవ్వాలని దర్శకుడు కూడా డిమాండ్ చేస్తున్నాడట. కానీ ఇది అగ్రిమెంట్ లో లేదు. అయినా కథగా ఒరిజినల్ థాట్ అతనిదే కదా..? అందుకే బ్లాక్ బస్టర్ కొట్టిన ఆనందం కంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ విషయంలో ఈ ఇద్దరి మధ్య ఓ పెద్ద పంచాయితీ నడుస్తోంది. ఇది సాల్వ్ అయితే కానీ.. సెకండ్ పార్ట్ కు సిద్ధం కాలేడు కళ్యాణ్‌ రామ్.

దీంతో ఇప్పుడీ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతోంది. మొత్తంగా కళ్యాణ్‌ రామ్ పరిచయం చేసిన దర్శకులంతా టాప్ ప్లేస్ కు వెళ్లారు. వారిలో ఎవరితోనూ అతనికి ఇన్ని ఇష్యూస్ లేవు. మరి వశిష్ట మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నాడో కానీ.. త్వరలోనే ఈ గొడవను సాల్వ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.

Related Posts