భోళా శంకర్ థర్డ్ సాంగ్.. మెగా ధమాకా

మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన సినిమా భోళా శంకర్. కీర్తి సురేష్ చెల్లిగా ఓ కీలక పాత్రలో నటించింది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది.

ఇంతకు ముందు తమన్నా.. చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించింది.ఫస్ట్ టైమ్ ఆయనకు జోడీగా ఈ మూవీ చేసింది.రీసెంట్ గా ఈ మూవీ నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. మరీ గొప్పగా ఉన్నాయని చెప్పలేం కానీ.. ఓకే అనిపించుకున్నాయి.

మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి తాజాగా మరో డ్యూయొట్ విడుదల చేశారు.మెగాస్టార్,తమన్నా స్టెప్పులతో అదిరిపోయిందీ పాట. పాటగా రొటీన్ గానే ఉన్నా.. మెగా గ్రేస్ స్టెప్పులు బావున్నాయి. ట్యూన్ మరీ గొప్పదైతే కాదు. కానీ కాస్త క్యాచీగానే ఉందని చెప్పాలి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని విజయ్ ప్రకాష్, సంజనా కల్మాంజే, మహతి సాగర్ పాడారు.


“అచ్చ తెలుగు పచ్చి మిర్చి మగాడు వీడు బొంబాట్ హాట్ హాట్ గా ఉన్నాడే” అంటూ మొదలైన ఈ పాట.. పంచదారా చిలక లాంటిప్యారీ సుకుమారీ, నీ ఛమక్ చూసి దుముకుతున్నా.. చిలిపిగ నోరూరి అంటూ మెగా వెర్షన్ తో సాగుతుంది.. చిరంజీవి, తమన్నా మధ్య డ్యూయొట్ అంటే ఎలా ఉండాలో అచ్చంగా అలానే ఉంది అనిపిస్తుందీ పాట చూడగానే.

అయితే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో మెగా స్టెప్పులు క్లాస్ గా ఉన్నాయి. అటు తమన్నా సైతం మెగా గ్రేస్ కోసం ట్రై చేసినట్టు కనిపిస్తోంది. స్విట్జర్లాండ్ అందాల మధ్య మంచి సినిమాటోగ్రఫీ కనిపిస్తోంది. మరి థియేటర్ లో ఈ పాటలోని మెగా స్టెప్పులకు ఎలాంటి విజిల్స్ పడతాయో చూడాలి.

Related Posts