తాగి వచ్చాడని ఆదిపై శేఖర్ మాస్టర్ ఫైర్

షూటింగ్ జరిగే సెట్ ఏదైనా ఆర్టిస్టులు పవిత్రంగా చూస్తారు. అలాంటి చోటికి తాగి రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. బట్ కొంతమంది మాత్రం మందు లేకుడా పని పూర్తి చేయలేరు.ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో డ్యాన్స్ లతో పాటు కామెడీ కూడా కనిపిస్తుంది.

ఒక్కోసారి డ్యాన్స్ లకంటే కామెడీనే ఎక్కువ డామినేట్ చేస్తుంది. దీనిపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి కామెడీ షోస్ లో కాస్త అతి చేయాలంటే ఆది కంటే ఎవరు బెస్ట్ అనిపించుకుంటారు. మామూలుగానే అందరినీ డీ గ్రేడ్ చేస్తూ కామెడీ చేస్తుంటాడు ఆది. పంచ్ లు, సెటైర్స్ ఎలా ఉన్నా.. బాడీ షేమింగ్ తోనూ నవ్విస్తా ఉంటాడు.

దీనిపైనా విమర్శలున్నాయి. ఇక ప్రదీప్ యాంకర్ గా చేస్తోన్న ఢీ షోకు శేఖర్ మాస్టర్, నటి పూర్ణ జడ్జ్ లుగా ఉన్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ షూటింగ్ సెట్ లోకి తాగి వచ్చాడు ఆది.


మామూలుగా అందరూ అది కామెడీ యాక్ట్ లో భాగం అనుకున్నారు. కానీ ఒక దశ దాటాక కానీ శేఖర్ మాస్టర్ కు ఆది నిజంగానే తాగాడు అని అర్థం కాలేదు. దీంతో ‘ ఢీ సెట్లో మందు తాగుతూ వస్తున్నావా నువ్వు’ అని ఆదిని అడిగాడు. దానికి ‘ నీ ప్రాబ్లమ్ ఏంటి శేఖర్’ అంటూ కౌంటర్ ఇచ్చాడు ఆది.

“ఫస్ట్ టైమ్ తాగినట్టున్నాడు కదా.. అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు” అని శేఖర్ మాస్టర్ అంటే దానికి ‘ఎవడికోయ్ ఫస్ట్ టైమ్.. ఐదు సీజన్ల నుంచితాగుతున్నాం.. గుడ్డు తెలుసా నీకు” అంట రూడ్ గా రిప్లై ఇచ్చాడు. దీంతో శేఖర్ మాస్టర్ తో పాటు పూర్ణ కూడా హర్ట్ అయినట్టు కనిపించారు. ఏదైనా మోతాదులో ఉన్నంత వరకూ బానే ఉంటుంది. అది మించితేనే అపార్థాలు మొదలవుతాయి. మరి ఈ ఎపిసోడ్ టెలీకాస్ట్ అయితే కానీ అసలు విషయం తెలియదు.

Related Posts