‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ ఊచకోత

మిగతా సమయాలతో పోల్చుకుంటే ఫెస్టివల్ సీజన్స్ లో వచ్చే సినిమాల కలెక్షన్స్ ఓ రేంజులో ఉంటాయి. హాలిడేస్ కలిసిరావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ దసరా సీజన్ లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ పరిస్థితి ఇదే. నటసింహం బాలకృష్ణ.. ‘భగవంత్ కేసరి’తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చేస్తున్నాడు.

టిక్కెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లో ఆరు రోజులకే 1 మిలియన్ ప్లస్ టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. ఇదో అరుదైన రికార్డు అని చెప్పొచ్చు. ఇక వసూళ్ల పరంగా ఇప్పటివరకూ రూ.125 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందీ చిత్రం.

సినిమా ఫ్లో దెబ్బతినకూడదని ఈ సినిమాలో ‘దంచవే మేనత్త కూతురా’ రీమిక్స్ సాంగ్ ను తొలుత కలుపలేదు. అయితే ఇప్పుడు ఈ పాట కూడా ‘భగవంత్ కేసరి’కి మరో అడ్వాంటేజ్ గా మారింది. మొత్తంమీద.. లాంగ్ రన్ లో బాలయ్య ‘భగవంత్ కేసరి’ ఎలాంటి వసూళ్ల సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Posts