భాగ్ సాలే టీజర్

ఎమ్ఎమ్ కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఫస్ట్ మూవీ మత్తు వదలరా మెప్పించింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆకట్టుకోలేదు. అయినా వరుస ప్రాజెక్ట్స్ తో వస్తున్నాడు. అతను ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు.అతని కొత్త సినిమా ”భాగ్ సాలే”. ఇక ద వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే బై సిద్దు జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో పరిచయం చేశారు.

1840లో కొల్లూరు ప్రాంతంలో ఓ రైతు పొలంలో పనిచేస్తున్న వ్యక్తికి వజ్రం దొరుకుతుంది. అది ఆ రైతుకు ఇస్తాడు అది వజ్రం అని తెలియని సదరు కూలీ. ఈ విషయంబ్రిటీష్ వారికి తెలుస్తుంది. వాళ్లు రైతు నుంచి ఆ వజ్రాన్ని లాక్కుని ఇంగ్లండ్ కు ‘షిప్పింగ్” చేస్తుంటే మరో ఫ్రెండ్ వాడు వచ్చి దాన్ని కొట్టేస్తాడు. తర్వాత ఫ్రెంచ్ వాడైన కింగ్ లూయీ చేతికి వస్తుంది. దాన్ని అతను ముక్కలు చేసి ఫ్రెండ్ రెవల్యూషన్ టైమ్ లో అందరికీ పంచుతాడు. అలా ఓ ముక్క మన నిజాం రాజు దగ్గరకు వస్తుంది.

దీన్ని అతను ఉంగరంగా మార్చుకుని దానికి షాలీ శుక్లా గాజా(SSG)అనే పేరు పెడతాడు. ఆ రింగ్ నిజాం వద్ద వందేళ్ల వరకూ ఉంటుంది. అది వచ్చాకే నిజాం పెద్ద ధనవంతుడు అవుతాడు. బ్రిటీష్‌ వాళ్లు నిజాం మీద దాడి చేస్తారు. అప్పుడు నిజాం వద్ద బ్యాడ్ పర్సన్ అయిన నాయుడు ఆ రింగ్ కొట్టేస్తాడు.

అప్పటి నుంచి వాళ్ల ఫ్యామిలీలోనే ఉంటుంది ఆ రింగ్.. ఈ రింగ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లు రిచ్ అవడంతో పాటు వాళ్ల లైఫ్ రచ్చ కూడా అవుతుంది.. ” అంటూ భాగ్ సాలే వరల్డ్ ను సిద్ధు జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ లో పరిచయం చేశారు. అయితే అసలు కథంటూ ఏం చెప్పకపోవడంతో ఇదంతా ఏదో సోదిలా ఉంది తప్ప నిజంగా ఆకట్టుకునేలా లేదు అనే టాక్ వినిపిస్తోంది.

Related Posts