డోస్ తగ్గించిన లస్ట్ స్టోరీస్2

లస్ట్ స్టోరీస్.. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన సంచలన వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ అప్పటి వరకూ చూడనంత హెవీ డోస్ తో ఉంది. పైగా అందులో నటించిన వారిలో స్టార్స్ ఎక్కువగా ఉన్నారు. సీన్స్ మాత్రమే కాక డైలాగ్స్ లోనూ డబుల్ మీనింగ్స్ డైరెక్ట్ గానే ఉన్నాయి.

ఈ సిరీస్ తర్వాత ఇతర భాషల్లో కూడా ఆ తరహా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎవరూ ఆ స్థాయిలో ధైర్యం చేయలేకపోయారు. అయితే కొంత గ్యాప్ తర్వాత అంతకు మించి వచ్చాయి. బట్ ఇవన్నీ జుగుప్సా కరంగాఉన్నాయి తప్ప.. లస్ట్ స్టోరీస్ లాంటి కంటెంట్ కనిపించలేదు. ఇక ఇన్నాళ్ల తర్వాత ఈ సిరీస్ కు రెండో పార్ట్ గా మరో సిరీస్ వస్తోంది. లస్ట్ స్టోరీస్ 2 అనే టైటిల్ తో రూపొందిన ఈ సీరిస్ ట్రైలర్ విడుదలైంది.


అయితే ఈ సిరీస్ కు సంబంధించి సౌత్ తో అత్యంత ఆసక్తిని కలిగించిన అంశం తమన్నా. ఆల్రెడీ రీసెంట్ గా వచ్చిన ఓ వెబ్ సిరీస్ లో బి గ్రేడ్ కు మించిన సన్నివేశాల్లో నటించింది తమన్నా. ఒక్క లిప్ లాక్ తప్ప అన్నీ అయ్యాయి అన్నట్టుగా కనిపించింది ఆ సిరీస్ లో.

అలాంటి తను లస్ట్ స్టోరీస్ లో నటిస్తుందంటే అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేస్తారు కదా ఆడియన్స్.. అయితే తమన్నా మాత్రమే కాదు. ఇతర కాస్టింగ్ విషయంలోనూ ఈ సారి డోస్ బాగా తగ్గించినట్టుగా కనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తుంటే. యస్.. లస్ట్ స్టోరీస్ లో అడల్ట్ కంటెంట్ అంతగా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

ఇది ట్రైలర్ కు పరిమితం చేసి సిరీస్ లో ఉంటుందా అనేది చెప్పలేం కానీ.. కాస్టింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి. తమన్నాతో పాటు ఆమె కొత్త లవర్ విజయ్ వర్మ ఓ జోడీగా నటించారు. ఆల్రెడీ పెళ్లైన వ్యక్తిగా విజయ్ నటించినట్టు కనిపిస్తోంది.


వీరితో పాటు ఒకప్పటి టాప్ హీరోయిన్ కాజోల్, కుముద్ మిశ్రా ఓ జోడీగాఅమృత సుభాస్, అంగద్ బేడీ జంటగా కనిపిస్తున్నారు. అలాగే మృణాల్ ఠాకూర్ ఎపిసోడ్ కూడా ఉంది. మొత్తంగా లస్ట్ స్టోరీస్ వచ్చే నాటికి ఇండియాలో ఈ కంటెంట్ కు అంత డిమాండ్ లేదు. కానీ ఇప్పుడు పెరిగింది. అయినా వీళ్లు తగ్గారు. అంటే ఈ సారి మరింత మంచి కంటెంట్ తో వస్తున్నారని అనుకోవచ్చు. ఇక ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లోనే ఈ నెల 29 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.

Related Posts