ఆదిపురుష్‌ రైటర్ నోటి దూల

టైమ్ బాలేనప్పుడు కామ్ గా ఉండాలనేది నీతి. కానీ ఓ వైపు వరుస వివాదాలు వస్తోంటే.. మరో వైపు మరిన్ని వివాదాలకు ఆజ్యం పోయడం ఎంత వరకూ సబబు. ఇప్పటికే ఆదిపురుష్ సినిమాపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవార నుంచి కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. కట్టర్ హిందువులు కూడా ఆదిపురుష్‌ ను విమర్శిస్తున్నారు.

అంటే ఈ సినిమా వారి మనోభావాలను ఎంత వరకూ దెబ్బ తీసిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఇష్యూస్ ను డైవర్ట్ చేయడమో లేక.. క్షమాపణ చెప్పి వివాదం సద్దుమణిగేలా చేయడమో చేయాలి. బట్ ఈ మూవీ రైటర్ మనోజ్ ముంతాషిర్ మాత్రం ఇంక రెచ్చగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలోని డైలాగ్స్ పై విపరీతమైన అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా హనుమంతుడు చెప్పిన నీ బాబు గుడ్డ, అనే డైలాగ్స్ పరమ నీచంగా అనిపించాయి. దీంతో మూవీ టీమ్ స్పందించి ఆ డైలాగ్స్ ను తొలగించాం అని చెప్పింది. ఈ టైమ్ లో మేం తీసింది రామాయణం కాదు అని వివాదాస్పదంగా మాట్లాడాడు.

అప్పటి వరకూ ఇది రామాయణం అని ప్రమోట్ చేసిన ఆదిపురుష్‌ టీమ్ తో పాటు అది రామాయణమే అనుకున్న ప్రేక్షకులను కూడా అవమానించాడు. ఈ గొడవ జరుగుతుండగానే లేటెస్ట్ గా హనుమంతుడు దేవుడే కాదు అన్నాడు. అతను కేవలం భక్తుడు మాత్రమే అని ఓ టివి చానల్ ఇంటిర్వ్యూలో చెప్పి.. మరోసారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు.

అసలు సినిమాపై వరుసగా విమర్శలు వస్తున్నప్పుడు ఇలాంటి దిగజారుడు మాటల వల్ల కలెక్షన్స్ తగ్గడమే కాదు.. వ్యక్తిత్వం కూడా డ్యామేజ్ అవుతుంది కదా..? మరి ఎందుకు ఇతనికి ఇంత నోటి దూల అని చెప్పుకుంటున్నారు. కనీసం దర్శక, నిర్మాతలైనా అతన్ని కామ్ గా ఉండమని చెప్పాలి కదా అనేది కొందరి వాదన.