శర్వానంద్ సినిమాకు బలే టైటిల్

టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఒక హిట్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న శర్వా కమర్షియల్ మూవీస్ లోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లు సేఫ్ గానే ఉన్నాడు. బట్ తర్వాత ట్రాక్ తప్పాడు. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడానికి నానా తంటాలు పడుతున్నాడు. రకరకాల జానర్స్ లో కథలు ట్రై చేస్తున్నాడు. అవేవీ వర్కవుట్ కావడంలేదు.

చివరగా వచ్చిన ఆడాళ్లూ మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవీ పోయాయి. కాకపోతే కొంత వరకూ ఒకే ఒక జీవితం బెటర్ అనిపించుకుంది తప్ప పెద్ద హిట్ అయితే కాదు. ఇక జూన్ 3న బెంగళూరుకు చెందిన రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు శర్వానంద్. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆ తర్వాత హనీమూన్ కు వెళ్లాడు. అయితే అంతకు ముందే ఓ సినిమా కమిట్ అయ్యాడు.


శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా జరుగుతుంది. శర్వానంద్ సరసన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పెళ్లికి ముందే ఈ చిత్రం విదేశాల్లో దాదాపు 40 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం హనీమూన్ లో ఉన్న శర్వానంద్ రాగానే మళ్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

అయితే ఈ చిత్రానికి ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ‘బేబీ ఆన్ బోర్డ్’ అనేదే ఆ టైటిల్. దీన్ని షార్ట్ గా BOB అని పిలుచుకుంటారట. బేబీ ఆన్ బోర్డ్ అనేది కార్ల వెనక భాగంలో కనిపిస్తుంది. మరి ఈ సినిమాకు ఆ టైటిల్ ఎలా యాప్ట్ అవుతుందో చూడాలి.

Related Posts