అనుపమ స్పెషల్ సాంగ్.. పర్సస్ ఏంటీ

అనుపమ పరమేశ్వరన్.. తెలుగులో స్ట్రాంగ్ గా పాగా వేస్తోన్న బ్యూటీ వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. తెలుగులోనే కాక మళయాలంలోనూ సినిమాలు చేస్తోంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ విషయంలో అనేక హద్దులు పెట్టుకుంది. కానీ రౌడీబాయ్స్ తర్వాత వాటిని చెరిపేసింది. ఏకంగా లిప్‌ లాక్స్ వరకూ వెళ్లింది. ఇప్పుడు చేస్తోన్న డిజే టిల్లు స్క్వేర్ లో కూడా ఆ తరహా సిజిలింగ్ సీన్స్ ఉంటాయని టాక్. సినిమాలతో పాటు అప్పుడప్పుడూ షార్ట్ ఫిల్మ్స్ స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది అనుపమ. అలా లేటెస్ట్ గా ఓ పాటలో నర్తించింది.


ఈ పాట ఉద్దేశ్యం ఇదీ అని స్పష్టంగా లేదు కానీ.. చాలా భారీ ఖర్చుతో రూపొందించినట్టు మాత్రం తెలుస్తోంది. పాటలోని పదాలు వింటే విమెన్ ఎంపౌర్ మెంట్ గురించిన మాటలు ఎక్కువగా ఉన్నాయి. దేనికీ వెనవక దేశాలన్నీ చుట్టేయొ.. లోకం మొత్తం నీదే అంటూ మగువలకు ధైర్యాన్ని నూరిపోసే పాటలా ఉంది. ఆ విషయాన్ని బయట నుంచి రెగ్యులర్ చేస్తూ ఆడవారి హక్కుల కోసం నినదించే చిన్మయి శ్రీపాద ఈ గీతాన్ని పాడటం విశేషం. కృష్ణ కాంత్ రాశాడు. డెన్నిస్ నోర్టాన్ మ్యూజిక్ అందించాడు. అయితే పాటలో మ్యూజిక్ డామినేషన్ ఎక్కువగా ఉంది. అందుకే పదాలు సరిగా అర్థం కావు. ట్యూన్ సైతం క్యాచీగా లేదు. అందుకే ఈ పాట అసలెందుకు చేశారా అనే డౌట్ కూడా వస్తుంది.


రిచర్డ్ ప్రసాద్, రుబీ నాజ్ నిర్మించిన ఈ గీతాన్ని విష్ణుదేవా కొరియోగ్రాఫ్‌ చేశాడు. హాంకాంగ్, చైనా వంటి దేశాల్లో చిత్రీకరించినట్టు అర్థం అవుతోంది. కాకపోతే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. చూస్తోంటే చాలా కాస్ట్ లీ సాంగ్ లా ఉంది. బట్ పర్పస్ మాత్రం పూర్తిగా ఎలివేట్ కాలేదనే చెప్పాలి.

Related Posts