బాలయ్య సౌ మార్ అదిరింది

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రీ లీల బాలయ్య కూతురుగా కాజల్ ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. కంప్లీట్ క్రేజీ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. అఖండ, వీర సింహారెడ్డి తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనేలా ఉందీ మూవీ ఫ్లేవర్.

ఇక లేటెస్ట్ గా బాలయ్య లక్కీ ఛామ్ గా మారిన తమన్ మ్యూజిక్ తో ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఆల్రెడీ ఈ పాటకు సంబంధించిన ప్రోమోతోనే అంచనాలు పెంచిన తమన్.. పాటతో అదరగొట్టాడు అనే చెప్పాలి.


గణపతి ఉత్సవాల నేపథ్యంలో వచ్చే పాట ఇది. అందుకు తగ్గట్టుగానే మేకింగ్ కూడా చాలాచాలా గ్రాండ్ గా ఉంది. తమన్ మ్యూజిక్ లో మాస్ బీట్స్ తో పాటు క్లాస్ గా అన్ని పదాలూ వినిపించేలా మంచి ఆర్కెస్ట్రైజేషన్ ఉంది. ఇక శ్రీ లీల జోష్ ను మ్యాచ్ చేస్తూ బాలయ్య కూడా అదిరిపోయే స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా అఖండలో షర్ట్ విప్పుతూ వేసిన స్టెప్ ను గుర్తుకు చేస్తూ ఈ పాటలో డ్రమ్స్ వాయిస్తూ ఉన్న ఒక మూమెంట్ అదిరిపోయింది. ఇక శ్రీ లీల డబుల్ కాదు.. త్రిబుల్ ఎనర్జీతో డ్యాన్స్ ఇరగ్గొట్టినట్టుంది. వీరి మధ్య రాపో కూడా బావుంది.


కాసర్ల శ్యామ్ రాసిన ఈ గీతంలో ఇప్పటి వరకూ విన్న వినాయకుడి వివిధ నామాలకు మించి కొన్ని కొత్త పేర్లు కూడా యాడ్ చేశాడు. అలాగే అమ్మ చేతిలో ఒకసారి అయ్య చేతిల ఒకసారి పుట్టాడు అంటూ తెలిసిన విషయాన్నే తెలివిగా చెప్పాడు. శేఖర్ మాస్టర్ మరోసారి సీనియర్స్ కు ఎలాంటి స్టెప్పులు ఇవ్వాలో అలాంటివే ఇచ్చినట్టున్నాడు. మొత్తంగా ఈ పాట ఈ సారి గణపతి ఉత్సవాల్లో మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts