HomeMoviesటాలీవుడ్కల్కి.. అంత ఈజీయేం కాదు

కల్కి.. అంత ఈజీయేం కాదు

-

టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో హాలీవుడ్ తో పోలిస్తే మనం ఎన్నో దశాబ్దాలు వెనకబడిపోయాం. అక్కడ విజువల్ వండర్స్ అనదగ్గ చిత్రాలెన్నో వచ్చిన యేళ్ల తర్వాత మనవాళ్లు.. అదీ సౌత్ నుంచి శంకర్, రాజమౌళి లాంటి దర్శకులత మ్యాజిక్ ఇండియన్ సినిమా రేంజ్ మారింది. హాలీవుడ్ తో పోటీ పడుతుంది అని చెప్పలేం కానీ.. అక్కడి వారిని ఇంప్రెస్ చేస్తుందని మాత్రం చెప్పొచ్చు. బట్ కంటెంట్ పరంగా చూస్తే మన దగ్గర చాలా కథలున్నాయి.

Maxresdefault 20

ఆ కథలకు టెక్నాలజీని జోడిస్తే అద్భుతాలు సృష్టించొచ్చు అనేది నిజం. ఒకప్పటి మన జానపద గాథలనే రాజమౌళి బాహుబలి అంటూ విజువలైజ్ చేస్తే.. ఆ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కు దేశం విస్తుపోయింది. ఔరా ఏమి సినిమా అనుకున్నారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో అదరగొట్టాడు. అంతకు ముందే శంకర్ రోబోతో రోమాంచితమైన గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ చేశాడు. ఆ రూట్ లోనే ఇప్పుడు కల్కి రాబోతోంది. అయితే కల్కి విషయంలో అనుకున్నంత సులువు కాదు ఆడియన్స్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అప్లాంజ్ పొందడం.

Shankar Vs Rajamouli Indian 2 Clash With RRR 2


కల్కి అనే టైటిల్ మనకు పురాణాలకు సంబంధించినది. విష్ణువు పదవ అవతారంగా కల్కి రూపం ధించారని పురాణాలు చెబుతున్నాయి. కలియుగాంతంలో మితిమీరిన అన్యాయాన్ని సంహరించేందుకు విష్ణువు కల్కి అవతారంలో వచ్చాడని భక్తులు నమ్ముతారు. సరిగ్గా ఇదే ఇప్పుడు నాగ్ అశ్విన్ కు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఆ పాత్రను ఓ సాధారణ పాత్రగా పరిచయం చేస్తే గొడవ ఉండదు. పురాణాలకు లింక్ చేశాడు కాబట్టి.. దాన్ని హిందువులు భక్తి కోణంలో చూస్తారు. అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఆదిపురుష్ లా వ్యవహారం కేస్ ల వరకూ వెళుతుంది.

Kalki 1


అదీ కాక టైమ్ ట్రావెల్ నేపథ్యంలో మన దగ్గర బెస్ట్ రిఫరెన్స్ అంటే ఆదిత్య 369 ఉంది. అలాగే హాలీవుడ్ నుంచి వచ్చిన అనేక సినిమాలను చూసి ఉన్నాం. వాటికీ ఈ చిత్రానికి ఉండే తేడా కూడా మన పురాణాల నుంచే కనిపెట్టినదై ఉండాలి. అప్పుడే కొంత వైవిధ్యం ఉంటుంది. దీంతో పాటు అనివార్యంగా విష్ణువు పాత్రను పోలిన పాత్రలు కనిపించాలి. ఇవన్నీ మిక్స్ చేసి మెప్పించడం అంటే అంత సులువు అయితే కాదు. మరి ప్రభాస్ ను ఈ అవతారంలో ఏ తరహాలో చూపించడానికి నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ రాసుకున్నాడో కానీ.. ఓ రకంగా చూస్తే కల్కి సినిమా నాగ్ అశ్విన్ కు బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే ఇది బాహుబలిలా జానపదం కాదు. ఆర్ఆర్ఆర్ లా ఫిక్షన్ కాదు. అందుకే అందరినీ మెప్పించడం అంత ఈజీ కాదు.

ఇవీ చదవండి

English News