మళ్లీ షూటింగ్ మోడ్ లోకి బాలకృష్ణ

‘భగవంత్ కేసరి‘తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ.. మళ్లీ షూటింగ్ మోడ్ లోకి వెళ్లబోతున్నాడు. తన 109వ సినిమాని మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. నవంబర్ 6 నుంచి బాలకృష్ణ-బాబీ కాంబో మూవీ పట్టాలెక్కనుందట. ఈ ఏడాది జూన్ లో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

‘వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్‘ అంటూ సినిమా ఓపెనింగ్ లోనే ఈ మూవీలోని యాక్షన్ పార్ట్ ఏ రేంజులో ఉంటుందనేది చెప్పకనే చెప్పారు. ఈకోవలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుపెట్టనున్నారట. ఇప్పటికే హైదరాబాద్ శివారులో ఈ సినిమాకోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను నిర్మించారట. ఆ సెట్ లోనే ఈ పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తర్వాత ఊటీలో మరో షెడ్యూల్ ని ప్లాన్ చేశారట.

ఈ సినిమాలోని బాలకృష్ణ ఇంట్రడక్షన్ ను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ బాబీ. నటసింహం బాలకృష్ణ బిరుదులోనే సింహం ఉంది. అలాంటి బాలయ్య సింహంతో తలపడితే ఎలా ఉంటుంది?. ఈ మూవీ లోని బాలయ్య తన ఎంట్రీ సీన్ లో ఓ సింహంతో తలపడనున్నాడనే ప్రచారం జరుగుతుంది.

Related Posts