‘ఇండియన్ 2‘ నుంచి స్పెషల్ అప్డేట్

కమల్ హాసన్-శంకర్ కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇండియన్’. 1996లో విడుదలైన ఈ సినిమా తెలుగులో ‘భారతీయుడు’ పేరుతో అనువాదమై ఇక్కడా సంచలన విజయం సాధించింది. ‘ఇండియన్‘కి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే ‘ఇండియన్ 2‘. 2019 జనవరిలోనే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కొంతకాలం బాగానే జరిగింది. అయితే.. 2020 ఫిబ్రవరిలో షూటింగ్ సమయంలో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ లో ముగ్గురు క్రూ మెంబర్స్ మరణించడంతో మూవీకి బ్రేక్ పడింది.

ఆ గొడవలు సద్దుమణిగిన తర్వాత మళ్లీ తిరిగి పట్టాలెక్కిన ‘ఇండియన్ 2‘ ఇప్పుడు విడుదలకు దగ్గర పడింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ ఈ క్రేజీ మూవీకి సంబంధించి గ్లింప్స్, సాంగ్, టీజర్ వంటివి ఏమీ రిలీజవ్వలేదు. లేటెస్ట్ గా ‘ఇండియన్ 2‘ నుంచి స్పెషల్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు డైరెక్టర్ శంకర్. రేపు (అక్టోబర్ 29) ఉదయం 11 గంటలకు ‘ఇండియన్ 2‘ నుంచి అప్డేట్ రాబోతుంది.

Related Posts