బ్యాక్ గ్రౌండ్ ఫుల్.. సక్సెస్ నిల్

ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా వారసులదే హవా. టాలెంట్ కంటే వారి బ్యాక్ గ్రౌండే ఎంట్రీకి మెయిన్ క్వాలిఫికేషన్ అయింది. అలా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరో అయ్యాడు శ్రీ సింహా.

ఫస్ట మూవీ మత్తు వదలరా కొంత వరకూ ఆకట్టుకుంది. అంతే.. ఇక తనూ స్టార్ హీరో అయిపోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఒక్కోటి ఆడియన్స్ పైకి వదులుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆ వెంటనే చేసిన తెల్లవారితో గురువారం, దొంగలున్నారు జాగ్రత్త వంటి సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.

రీసెంట్ గా భాగ్ సాలే అంటూ వచ్చాడు. ఇది చూసి ఆడియన్స్ పరుగులు పెడుతున్నారు. అస్సలే మాత్రం ఆకట్టుకోని కంటెంట్ తో వచ్చిన సినిమా ఇది. ఇక నెక్ట్స్ ఉస్తాద్ అంటూ రాబోతున్నాడు. బలగంతో హిట్ కొట్టిన కావ్య కళ్యాణ్‌ రామ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది.


ఇంతకీ శ్రీ సింహా ఫ్యామిలీ ఏంటో తెలుసు కదా.. ఆస్కార్ అవార్డ్ అందుకున్న కీరవాణి తనయుడు. గ్లోబల్ స్టార్ డైరెక్టర్ గా వెలుగుతున్న రాజమౌళికి కొడుకు వరస. ఈ రెండు పేర్లు చాలు.. అతని నేపథ్యం ఎంత పెద్దదో చెప్పడానికి. అయినా ఆ ఫ్యామిలీ నుంచి అతని సినిమాలకు ఫస్ట్ షో చూడ్డానికి వస్తున్నారు తప్ప..

ఎవరూ సపోర్ట్ గా నిలవడం లేదు అని అర్థం చేసుకోవచ్చు. చెప్పడానికి అతను స్వయంకృషితో ఎదగాలనే మేం పట్టించుకోవడం లేదు అంటారు కానీ.. అతని టాలెంట్ వారికి తెలియదా..? మొహంలో సరైన ఎక్స్ ప్రెషన్ పలకదు.

డైలాగ్ డెలివరీలో స్పష్టత ఉండదు. ఏ తరహా పాత్రలకు సూట్ అవుతాడు అనేది ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. అందుకే .. శ్రీ సింహాతో ఎవరైనా సినిమాలు చేస్తే వెళ్లి చూస్తున్నారు తప్ప.. సపోర్ట్ చేయడం లేదు. అందుకే అతని బ్యాక్ గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉన్నా.. సపోర్ట్ నిల్ గా ఉంది.

Related Posts