బేబి కాంబో ఈజ్ బ్యాక్

హిట్టైన కాంబోని మళ్లీ మళ్లీ రిపీట్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు మేకర్స్. ఇక.. సూపర్ హిట్టైన కాంబినేషన్స్ కోసం సేనీ ప్రేమికులు కూడా ఎంతో ఈగర్ వెయిట్ చేస్తుంటారు. లేటెస్ట్ గా అలాంటి హిట్ కాంబో ఒకటి సెట్ అయ్యింది.

ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కల్ట్ బ్లాక్ బస్టర్ గా సత్తా చాటిన ఆ చిత్రమే ‘బేబి‘. మెగాస్టార్, ఐకాన్ స్టార్ వంటి వారు కూడా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఈ సినిమాని ఆకాశానికెత్తేశారంటే ‘బేబి‘ సినిమా విజయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏకంగా 100 కోట్లు వసూళ్లు సాధించింది.

అయితే ‘బేబి‘ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే,మాటలు అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాను ఎస్.కే.ఎన్ తో కలిసి సాయి రాజేష్ ప్రొడ్యూసర్ గానూ వ్యవహరిస్తున్నారు. నూతన దర్శకుడు రవి నంబూరి ఈ మూవీకి డైరెక్టర్. అలాగే ‘బేబి‘ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్నందించిన విజయ్ బుల్గానిన్ ఈ మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట.

Related Posts